తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరుష్క జోడీ దాతృత్వం.. ఏం చేశారంటే?

విరుష్క జోడీ మరోసారి మంచి మనసు చాటుకుంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడి వైద్య ఖర్చుల కోసం విరాళాల సేకరణకు మద్దతు ప్రకటించారు వీరు. విరాట్​తో పాటు సారా అలీ ఖాన్​, అర్జున్​ కపూర్​, రాజ్​కుమార్ రావు వంటి ప్రముఖులు వీరికి జత కలిశారు.

virat kohli, anushka sharma
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

By

Published : May 25, 2021, 8:55 AM IST

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. వెన్నెముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడి వైద్యం కోసం విరాళాల సేకరణకు మద్దతు ప్రకటించారు. అరుదైన ఈ జన్యు వ్యాధిని నయం చేయడానికి వాడే ఔషధం విలువ అక్షరాల రూ.16 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం.

ఆయాన్ష్​ అనే బాలుడు ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతని తల్లిదండ్రులు 'ఆయాన్ష్​ ఫైట్స్​ ఎస్​ఎంఏ' పేరుతో ట్విట్టర్​ ఖాతాను తెరిచి.. దాని ద్వారా విరాళాల సేకరణకు పలువురిని అభ్యర్థించారు. వీరికి విరుష్క జోడీతో పాటు హీరో సారా అలీ ఖాన్, అర్జున్​ కపూర్​, రాజ్​కుమార్ రావు వంటి ప్రముఖులు మద్దతు పలికారు. వీరి అండతో మెడిసిన్​కు కావాల్సిన రూ.16 కోట్లను విరాళంగా సేకరించారు.

ఇదీ చదవండి:ఫస్ట్​ క్లాస్​ ప్లేయర్లకు 'రంజీ' పరిహారం ఎప్పుడో?

"ఇది చాలా కష్టమైన విషయం. ఇది సాధ్యమవుతుందని అనుకోలేదు. మేము వైద్యానికి అవసరమైన రూ.16 కోట్లను విరాళాల రూపంలో పొందాము. ఇందుకు సంతోషంగా ఉంది. మాకు మద్దతు తెలిపిన ప్రముఖులకు ధన్యవాదాలు. ఇది మీ విజయం" అని ఆయాన్ష్​ తల్లిదండ్రులు పేర్కొన్నారు.

మద్దతుగా నిలిచిన కోహ్లీ-అనుష్క దంపతులకు ఆయాన్ష్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కానీ, విరుష్క జోడీ ఎంత సాయంగా ప్రకటించారో మాత్రం వెల్లడించలేదు.

"అభిమానులు అంటే మాకు ఎప్పుడు ప్రేమ ఉంటుంది. కానీ, మేము ఊహించిన దానికంటే ఎక్కువ విరాళాలు రావడానికి మీరే కారణం. ఇందుకు మీకు కృతజ్ఞతలు. మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను" అని విరాట్ ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:విరుష్క జోడీ విరాళాల సేకరణ రూ.11 కోట్లు

ABOUT THE AUTHOR

...view details