టీ20 ప్రపంచకప్‌లో(T20 worldcup 2021 schedule) టీమ్‌ఇండియా బలంగా కనిపిస్తున్నా మనవాళ్లకు గట్టి పోటీనిచ్చే, కప్పు గెలిచే సామర్థ్యం ఉన్న జట్లు మూడున్నాయి. అవే ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్. అయితే, సూపర్-12లో భారత్, న్యూజిలాండ్(t20 world cup newzland vs india) ఒకే గ్రూప్‌లో ఉండటం వల్ల తొలి ప్రమాదం కివీస్ నుంచే పొంచి ఉంది. ఒకవేళ ఇక్కడ ఓడినా భారత్ పాకిస్థాన్, అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లపై గెలుపొంది సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు మరో గ్రూప్‌లో ఉండటం వల్ల టీమ్‌ఇండియాతో సెమీస్‌లో పోటీపడే అవకాశం ఉంది. దీంతో కోహ్లీసేనకు నాకౌట్‌లోనే అసలు ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఆ మూడు జట్లు ఎలా ఉన్నాయి? ఆటగాళ్లు ఎలా ఉన్నారు? ఇదివరకు వారి ప్రదర్శన ఎలా ఉంది..? అనేది తెలుసుకుందాం.
వన్డే ప్రపంచకప్ గెలిచిన జోష్‌లో ఇంగ్లాండ్..
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇంగ్లాండ్ జట్టు గురించే. 2015 వన్డే ప్రపంచకప్‌లో(2015 cricket world cup england) ఘోర వైఫల్యం తర్వాత ఈ జట్టు ఆటే మారిపోయింది. టెస్టు జట్టుగా ఉన్న ముద్రను పోగొట్టుకుంటూ దూకుడైన ఆటతో వన్డేలు, టీ20ల్లో మేటి జట్టుగా ఎదిగింది. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. బట్లర్, రాయ్, మలన్, బెయిర్‌స్టో లాంటి విధ్వంసకారులు.. మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కరన్ లాంటి ఆల్‌రౌండర్లతో ఆ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. అవసరమైతే జోర్డాన్, వోక్స్, విల్లీ లాంటి బౌలర్లూ బ్యాటుతో రాణించగలరు. సమతూకంతో, ఎంతో ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇంగ్లాండ్‌ను భారత్ ఎదుర్కొంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
విండీస్ ప్రమాదకరమే..
టీ20ల్లో వెస్టిండీస్(T20 worldcup westindies) ఎంత ప్రమాదకరమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలిచిన ఏకైక జట్టు ఇదే. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఎక్కువ మ్యాచ్‌లాడి ఈ ఫార్మాట్లో రాటుదేలిపోయారు విండీస్ వీరులు. లూయిస్, సిమన్స్, ఫ్లెచర్, పొలార్డ్, గేల్, రసెల్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఆ జట్టు సొంతం. ఆల్‌రౌండర్లకూ కొదవలేదు. లోతైన బ్యాటింగ్ విండీస్‌కు మరో బలం. ఏ స్థితిలోనైనా ఫలితాలను మార్చేసే ఆటగాళ్లు కరీబియన్ జట్టులో మెండుగా ఉన్నారు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయినా.. ఈ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు.