తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup: టీమ్​ఇండియా​ వార్మప్ మ్యాచ్​లు.. ఆ జట్లతోనే

టీ20 వరల్డ్​కప్​(T20 World Cup) కంటే ముందు.. ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియాతో వార్మప్​ మ్యాచ్​ల్లో తలపడనుంది భారత్​. ఇంగ్లాండ్​తో అక్టోబరు 18న, ఆస్ట్రేలియాతో అక్టోబరు 20న జరగనుంది.

T20 WC
టీ20 వరల్డ్​కప్

By

Published : Sep 18, 2021, 2:20 PM IST

టీ20 ప్రపంచకప్​ కంటే(T20 World Cup) ముందు భారత్​-పాక్​ మధ్య జరిగే మ్యాచ్​ అక్టోబర్​ 24న జరగనుంది. అంతకుముందే ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియాతో వార్మప్​ మ్యాచ్​ల్లో తడపడనుంది టీమ్​ఇండియా. ఇంగ్లాండ్​తో అక్టోబరు 18న, ఆస్ట్రేలియాతో అక్టోబరు 20న ఈ మ్యాచ్​లు జరగనుంది.

జట్టులోకి అశ్విన్..

సెప్టెంబర్ 8న టీ20 ప్రపంచకప్​ మ్యాచ్‌లకు టీమ్​ఇండియా జట్టు​ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ.. రవిచంద్రన్​ అశ్విన్​ను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. అశ్విన్​.. చివరి టీ20 2017 జులైలో వెస్టిండీస్​తో ఆడాడు. దాంతోపాటు మాజీ సారథి ధోనీని మెంటార్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

మొదట భారత్​లోనే టీ20 వరల్డ్​కప్(T20 World Cup)​ జరగాల్సిఉంది. కానీ కరోనా మహమ్మారి దృష్ట్యా యూఏఈ, ఒమన్​లో జరగనున్నాయి.

మార్చి 2021నాటి ర్యాంకింగ్స్ ఆధారంగా ఇటీవలే ఈ మెగాటోర్నీకి సంబంధించిన డ్రాను ప్రకటించారు. ఇందులో దాయాది దేశాలు భారత్-పాక్​ ఒకే గ్రూప్​లో ఉన్నాయి. దీనిని సూపర్ 12 మ్యాచ్​లుగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు(t20 world cup schedule 2021) జరగనుంది.

  • గ్రూప్ 1- వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ గ్రూప్-ఏ విజేత, గ్రూప్-బీ రన్నరప్​
  • గ్రూప్ 2- భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, క్వాలిఫయర్ గ్రూప్-ఏ రన్నరప్, గ్రూప్​-బీ విజేత
  • ఫస్ట్ సెమీఫైనల్​.. అబుదాబి.. నవంబర్​ 10
  • సెకండ్ సెమీఫైనల్..దుబాయ్​..నవంబర్​ 11
  • ఫైనల్..​ దుబాయ్​.. నవంబరు 14(ఆదివారం)

ఇదీ చదవండి:T20 World Cup: భారత టీ20 ప్రపంచకప్​ జట్టు.. మెంటార్​గా ధోనీ

ABOUT THE AUTHOR

...view details