- IPL 2022: ఐపీఎల్ మెగావేలం దిగ్విజయంగా పూర్తయింది. పలు జట్లలో చాలామార్పులు జరిగాయి. మార్చి 27 నుంచి లీగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్ల బలాబలాలు, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయో చూసేయండి. క్రికెట్ విశ్లేషకుల ప్రకారం.. చిన్నచిన్న మార్పులతో దాదాపు 10 జట్లూ ఈ కింది కూర్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
ముంబయి ఇండియన్స్
మెగావేలంలో ఇషాన్ కిషన్, జోఫ్రా ఆర్చర్, టిమ్ డేవిడ్‌ను భారీ ధరకు దక్కించుకుంది ముంబయి ఇండియన్స్. వీరు జట్టులో ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే గత సీజన్లలో జట్టు విజయాల్లో కీలకంగా ఉన్న డికాక్, పాండ్య సోదరుల లోటును భర్తీ చేయడం కష్టమైన పనే. ఇక నాణ్యమైన భారత స్పిన్నర్ లేకపోవడం లోటే!
తుది జట్టు (అంచనా)
- రోహిత్ శర్మ (కెప్టెన్)
- ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
- సూర్యకుమార్ యాదవ్
- తిలక్ వర్మ
- టిమ్ డేవిడ్
- కీరన్ పొలార్డ్
- ఫేబియన్ అలెన్
- జయదేవ్ ఉనద్కత్
- టైమల్ మిల్స్
- మయాంక్ మార్కండే
- జస్ప్రీత్ బుమ్రా
చెన్నై సూపర్ కింగ్స్
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమకు విజయాలు అందిస్తూ వచ్చిన కోర్ టీమ్‌కే పరిమితమైంది. డుప్లెసిస్ స్థానంలో కాన్వే, శార్దూల్ స్థానంలో శివమ్ దూబే కీలకంగా మారొచ్చు. అయితే డుప్లెసిస్, రైనా స్థానాలు భర్తీ చేయడం మాత్రం కష్టమే.
తుది జట్టు (అంచనా)
- రుతురాజ్ గైక్వాడ్
- డెవన్ కాన్వే
- మొయిన్ అలీ
- అంబటి రాయుడు
- ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్‌కీపర్)
- రవీంద్ర జడేజా
- శివమ్ దూబే
- డ్వేన్ బ్రావో
- దీపక్ చాహర్
- ఆడం మిల్నే
- తుషార్ దేశ్‌పాండే
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
మెగావేలంలో ఆటగాళ్ల ఎంపికను బట్టి పూర్తి సన్నద్ధతో లఖ్‌నవూ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే సీనియర్ స్పిన్నర్లు లేకపోవడం జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
తుది జట్టు (అంచనా)
- కేఎల్ రాహుల్ (కెప్టెన్)
- క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్)
- మనీష్ పాండే
- మార్కస్ స్టోయినిస్
- దీపక్ హుడా
- కృనాల్ పాండ్య
- జేసన్ హోల్డర్
- కే గౌతమ్
- మార్క్ వుడ్
- రవి బిష్ణోయ్
- అవేశ్ ఖాన్
దిల్లీ క్యాపిటల్స్
ధావన్, శ్రేయస్ అయ్యర్‌ను కోల్పోయిన ఇప్పటికీ టోర్నీలోని టాప్ 4 ప్లేయర్స్ దిల్లీ జట్టుతోనే ఉన్నారు. బౌలింగ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. తుది జట్టు సరిగ్గా ఉంటే అన్ని జట్లకు మంచి పోటీ ఇవ్వగలదు దిల్లీ.
తుది జట్టు (అంచనా)
- డేవిడ్ వార్నర్
- పృథ్వీ షా
- మిచెల్ మార్ష్
- రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్‌కీపర్)
- రోవ్మన్ పావెల్
- అక్షర్ పటేల్
- శార్దూల్ ఠాకూర్
- కుల్దీప్ యాదవ్
- అన్రిచ్ నోర్జ్
- చేతన్ సకారియా
పంజాబ్ కింగ్స్
కేఎల్ రాహుల్ వంటి టాప్ బ్యాటర్‌ను భర్తీ చేయడానికి ధావన్‌ను తీసుకుంది పంజాబ్. బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్ వంటి హిట్టర్లు, షారుక్‌ఖాన్, ఓడియన్ స్మిత్ లాంటి వారు మిడిల్ఆర్డర్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.
తుది జట్టు (అంచనా)
- శిఖర్ ధావన్ (కెప్టెన్)
- మయాంక్ అగర్వాల్
- జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్)
- లియామ్ లివింగ్‌స్టోన్
- షారుక్ ఖాన్
- రిషి ధావన్
- హర్‌ప్రీత్ బ్రార్
- ఓడియన్ స్మిత్
- కగిసో రబాడ
- అర్ష్‌దీప్ సింగ్
- రాహుల్ చాహర్
కోల్‌కతా నైట్‌రైడర్స్
చాలావరకు కోర్ టీమ్‌తోనే బరిలోకి దిగనున్న కేకేఆర్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వహించే అవకాశం ఉంది. అయితే రహానె అనుభవం జట్టుకు ఉపయోగపడినా, అతడు ఎంతవరకు దూకుడుగా ఆడతాడనేది అనుమానమే!