టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ వెన్నునొప్పితో బాధ పడుతున్నాడా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. న్యూజిలాండ్‌తో మూడో వన్డే సందర్భంగా తాను ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో వెన్నునొప్పితో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. స్ట్రెచర్‌పై పడుకున్న పంత్ ఫోటోలు లీకై సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పంత్ గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్ పంపించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో డిసెంబర్ 4 నుంచి మొదలుకానున్న బంగ్లాదేశ్ టూర్‌కు పంత్ వెళ్లేది అనుమానంగా మారింది. మరి అతని స్థానంలో ఎవరినైనా ఎంపిక చేస్తారా లేక పంత్‌ను ఆడిస్తారా అనేది చూడాలి.
ఇక పంత్ బ్యాటింగ్ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని అవకాశాలిచ్చినా పంత్ తన బ్యాటింగ్ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. పేలవ షాట్లతో వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. ఇక తన చివరి ఐదు వన్డేల్లో పంత్ చేసిన స్కోర్లు.. 10, 15, 125,0, 56, 18.. ఇక 2022 ఏడాదిలో 12 వన్డేలు ఆడిన పంత్ 223 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేలతో పోలిస్తే టీ20ల్లో అతని బ్యాటింగ్ కాస్త బెటర్‌గా కనిపిస్తుంది.