Kohli on IND vs SA Series: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. బ్యాటింగ్ ఆర్డర్లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
"ఈ టెస్టు సిరీస్ ఆసాంతం గొప్పగా సాగింది. తొలి టెస్టులో మేం మెరుగ్గా రాణించి పైచేయి సాధించాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న దక్షిణాఫ్రికా రెండో టెస్టులో గొప్పగా పోరాడి విజయం సాధించింది. అదే ఊపుతో మూడో టెస్టులో గెలుపొంది.. సిరీస్‌ను సొంతం చేసుకుంది. కీలక సమయాల్లో మా ఆటగాళ్లు విఫలమయ్యారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న సఫారీ జట్టు ఆధిపత్యం చెలాయించింది. మా జట్టు కంటే మెరుగ్గా రాణించింది. వెంటవెంటనే కీలక వికెట్లు కోల్పోవడంతో మేం కొంచెం వెనుకబడిపోయాం. అలాగే, కీలక సమయాల్లో బౌలర్లు కూడా విఫలమవడంతో పుంజుకోలేకపోయాం. అది చాలా నిరాశకు గురి చేసింది. సఫారీ బౌలర్లు స్థిరత్వంతో బౌలింగ్ చేసి భారత్‌ని దెబ్బతీశారు. పక్కా ప్రణాళికతో వచ్చి బ్యాటర్లను ఒత్తిడికి గురి చేశారు. మా బ్యాటింగ్ ఆర్డర్లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. గత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో మెరుగ్గా రాణించినంత మాత్రాన.. దక్షిణాఫ్రికాలో అదే విధంగా రాణిస్తామని గ్యారంటీ ఇవ్వలేం!"
-- విరాట్ కోహ్లీ, టెస్టు సారథి.
ఆత్మ విశ్వాసం పెరిగింది..