తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ, పీసీబీ మధ్య 'కేపీఎల్' రగడ! - షాహిద్ అఫ్రిదీ

కశ్మీర్​ ప్రీమియర్​ లీగ్​పై భారత్, పాకిస్థాన్​ క్రికెట్ బోర్డుల మధ్య దుమారం చెలరేగింది. ఈ టోర్నీకి గుర్తింపు ఇవ్వకూడని ఐసీసీని బీసీసీఐ కోరగా, ఈ చర్యపై తీవ్రంగా మండిపడుతోంది పీసీబీ.

KPL
కేపీఎల్

By

Published : Aug 3, 2021, 12:50 PM IST

కశ్మీర్​ ప్రీమియర్​ లీగ్(కేపీఎల్)​పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. మరో మూడు రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, ఈ లీగ్​ను గుర్తించొద్దని ఐసీసీకి బీసీసీఐ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

కశ్మీర్ ప్రీమియర్ లీగ్

ఆగస్టు 6న ప్రారంభమయ్యే ఈ లీగ్​లో షాహిద్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం లాంటి క్రికెటర్లు తమ జట్లకు నాయకత్వం వహించనున్నారు. అయితే, ఈ లీగ్​ పాక్ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)లోని ముజఫరాబాద్​లో​ జరగుతున్న నేపథ్యంలో దానికి బీసీసీఐ అభ్యంతరం తెలిపింది. ఆ ప్రాంతంపై భారత్​, పాక్ మధ్య ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ కారణంగానే 2013 నుంటి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు జరగడం లేదు.

కేపీఎల్ టోర్నీ

'బీసీసీఐ బెదిరిస్తోంది'

అయితే, కేపీఎల్​లో పాల్గొనే విదేశీ క్రికెటర్లను బీసీసీఐ బెదిరిస్తోందని ఆరోపించింది పీసీబీ. క్రికెట్ సంబంధిత వ్యవహారాల కోసం వారికి భారత్​లో ప్రవేశం ఉండబోదని హెచ్చరించిందని చెబుతోంది. సౌతాఫ్రికా క్రికెటర్ హర్షెల్ గిబ్స్​ కూడా బీసీసీఐపై విమర్శలు చేశాడు. అలాగే భారత్​లో స్పోర్ట్స్​ మీడియాలో పనిచేయాలనే కాంక్షతోనే ఇంగ్లాండ్ మాజీ సారథి మాంటీ పనేసర్ కేపీఎల్​ నుంచి తప్పుకొన్నాడని వార్తలు వస్తున్నాయి.

జారుకున్న ఐసీసీ..

అయితే కేపీఎల్​ అంతర్జాతీయ టోర్నీ కాదు కాబట్టి తమ పరిధిలోకి రాదని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి:స్టార్ ఆటగాళ్లను భయపెడుతున్న ఆ 'ఒక్కటి'!

ABOUT THE AUTHOR

...view details