తెలంగాణ

telangana

ETV Bharat / sports

రికార్డుల ఆటగాడు- ఐపీఎల్ వేటగాడు!

విరాట్‌ కోహ్లీ.. సమకాలీన క్రికెట్‌లో మేటి ఆటగాడు. ఫార్మాట్‌ ఏదైనా తన ముద్ర చూపిస్తూ దూసుకుపోయే పరుగుల వేటగాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా తనదైన శైలిలో జట్టును నడిపిస్తూ మెప్పిస్తున్నాడు. ఈ ఏడాది ట్రోఫీ నెగ్గాలన్న కసితో పరుగుల దాహం పెంచుకుని 6000 పరుగుల మైలురాయి దాటాడు ఈ ఛేదన రారాజు. ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

virat kohli records in IPL History
రికార్డుల ఆటగాడు- ఐపీఎల్ వేటగాడు!

By

Published : Apr 23, 2021, 1:52 PM IST

Updated : Apr 23, 2021, 2:13 PM IST

కింగ్‌ కోహ్లీ రికార్డులను మరెవరైనా అధిగమించాలంటే మరో ఐపీఎల్‌ ఆడితేగానీ సాధ్యపడదేమో. అది కూడా.. ఆ ఐపీఎల్‌లో విరాట్‌ ఆడకపోతే! అటువంటి ఎన్నో రికార్డులకు దిక్సూచిగా నిలిచాడు కింగ్​ కోహ్లీ. ఇప్పుడు టోర్నీలో 6 వేల పరుగుల మైలురాయికి చేరుకున్న తొలి బ్యాట్స్​మన్​గా అవతరించాడు​. ఈ సందర్భంగా అతడి కెరీర్​లో నెలకొల్పిన అరుదైన రికార్డులేవో ఈ సందర్భంగా తెలుసుకుందాం.

5 సెంచరీలు..

నిలకడకు మారుపేరైన కోహ్లీ ఐపీఎల్‌ సీజన్లన్నింటిలో కలిపి 5 సెంచరీలు బాదాడు. కోహ్లీ కన్నా ముందు ఒకటో స్థానంలో గేల్‌ 6 సెంచరీలతో ఉన్నాడు. 500 బౌండరీల క్లబ్‌లో ధావన్‌, వార్నర్‌ల తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే గేల్‌, డివిలియర్స్‌, రోహిత్‌, పొలార్డ్‌ల తర్వాత 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు.

పరుగుల పార్ట్‌నర్‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన 16వ ఐపీఎల్‌ మ్యాచ్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌తో కలిసి కోహ్లీ 181 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇది బెంగళూరుకు ఉత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం. ఈ క్రమంలో గేల్‌, దిల్షాన్‌ల 167 పరుగులు రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌లో నమోదైన 178 పరుగుల స్కోరును బెంగళూరు వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. ఇది భారీ ఛేదనల్లో మూడోది. అంతకు ముందు గంభీర్‌, క్రిస్‌లిన్‌లు (కేకేఆర్‌)వికెట్‌ పడకుండా గుజరాత్‌ లయన్స్‌ జట్టు చేసిన 184 పరుగులను ఛేదించారు. వాట్సన్‌, డుప్లెసిస్‌లు(చెన్నై) 179 పరుగుల లక్ష్యాన్ని (పంజాబ్‌ మీద) ఛేదించారు.

ఇక డివిలియర్స్‌తో కలిసి కోహ్లీ గుజరాత్‌ లయన్స్‌ మీద 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇదే ఇప్పటికీ ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాల రికార్డ్. మరోసారి డివిలియర్స్‌తోనే కలిసి ముంబయి ఇండియన్స్‌ మీద 215 పరుగులు చేశాడు. క్రిస్‌ గేల్‌తోనూ 204 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. టాప్‌ 5 రికార్డు భాగస్వామ్యాల్లో మూడింట్లో విరాట్‌ ఉన్నాడు.

కళాత్మక విధ్వంసం..

విరాట్‌ ఆడిన తొలి ఐపీఎల్‌లో కేవలం 165 పరుగులే చేశాడు. సగటు 15. ఆ తర్వాత సీజన్ల నుంచి రెచ్చిపోయాడు. విరాట్‌ కోహ్లీ చివరి నాలుగు ఓవర్లలో బ్యాటింగ్‌ స్ర్టైక్‌రేట్‌ 205.5. విరాట్‌ విధ్వంసం కూడా కళాత్మకంగానే ఉంటుంది. మొదటి నుంచి బెంగళూరు జట్టుతోనే ఉన్న కోహ్లీ 2013 నుంచి నాయకుడిగా కొనసాగుతున్నాడు. ట్రోఫీని ముద్దాడాలనే కల ఈ ఏడాది తీరాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఐపీఎల్​లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బ్యాట్స్​మన్​గా విరాట్​ కోహ్లీ ఘనత సాధించాడు. అయితే ఈ జాబితాలో కోహ్లీ తర్వాత రెండో స్థానంలో ఉన్న సురేశ్‌ రైనా 5448 పరుగులతో కొనసాగుతున్నాడు. తర్వాత ధావన్‌ 5428, వార్నర్‌ 5384 పరుగులతో ఉన్నారు. ఇప్పటికే 196 ఐపీఎల్‌ మ్యాచులు పూర్తి చేసుకున్న కోహ్లీ త్వరలోనే 200 మ్యాచులాడినవారి జాబితాలో చేరనున్నాడు.

ఇదీ చూడండి..దిల్లీ క్యాపిటల్స్​ క్యాంప్​లో అక్షర్​ పటేల్​

Last Updated : Apr 23, 2021, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details