ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల వేలం ద్వారా బీసీసీఐ జాక్‌పాట్ కొట్టింది. 2023తో ప్రారంభమయ్యే ఐదేళ్లకాలానికి మీడియా ప్రసార హక్కుల ద్వారా రూ.48,390 కోట్ల ఆదాయం పొందనుంది. క్రీడాచరిత్రలోనే మీడియా ప్రసార హక్కుల అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో టీవీ ప్రసార హక్కులను డిస్నీ స్టార్ రూ.23,575 కోట్లతో నిలబెట్టుకుంది. డిజిటల్ ప్రసార హక్కులను రిలయెన్స్‌కు చెందిన వయాకామ్ 18 రూ.20,500 కోట్లకు సొంతం చేసుకుంది.
బీసీసీఐకి జాక్‌పాట్.. రూ.48,390 కోట్లకు ఐపీఎల్ మీడియా రైట్స్ - ipl media rights
ఐపీఎల్ మీడియా హక్కుల వేలంపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మీడియా ప్రసార హక్కుల ద్వారా మొత్తం రూ.48,390 కోట్ల ఆదాయం రానుందని తెలిపింది. రెండేళ్లు కరోనా పరిస్థితులు కొనసాగినా బీసీసీఐ సంస్థాగత సామర్థ్యానికి ఈ వేలం ప్రత్యక్ష నిదర్శనమని బోర్డు కార్యదర్శి జైషా ట్విట్ చేశారు.
d
ఈ సంస్థే మరో రూ. 2,991 కోట్లకు నాన్-ఎక్స్‌క్లూజివ్ సి-ప్యాకేజీని దక్కించుకుంది. ఏ, బీ ప్యాకేజీల్లో భాగంగా మొత్తం ఐదేళ్లలో 410 మ్యాచ్‌లు ఉంటాయి. 2023, 2024లో 74 చొప్పున మ్యాచ్‌లు, 2025, 2026లో 84 చొప్పున, 2027లో 94 మ్యాచ్‌లు ఉంటాయి. రెండేళ్లు కరోనా పరిస్థితులు కొనసాగినా బీసీసీఐ సంస్థాగత సామర్థ్యానికి ఈ వేలం ప్రత్యక్ష నిదర్శనమని బోర్డు కార్యదర్శి జైషా ట్విట్ చేశారు.
ఇదీ చూడండి :ఐపీఎల్లో అలా జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయా!: సునీల్ గావస్కర్