తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ సారి ఐపీఎల్​లో తీవ్రమైన పోటీనిస్తాం: సంగక్కర - ఐపీఎల్​ 2022 రాజస్థాన్​ రాయల్స్​

IPL 2022 Rajasthan royals sangakkara: ఈ సారి ఐపీఎల్​లో తీవ్రమైన పోటీనిస్తామని రాజస్థాన్‌ రాయల్స్‌ డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌ కుమార సంగక్కర తెలిపాడు. తమ జట్టు బలంగా ఉందని చెప్పాడు.

ipl
సంగక్కర

By

Published : Mar 17, 2022, 9:54 PM IST

IPL 2022 Rajasthan royals sangakkara: ఐపీఎల్‌ అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్‌ నెగ్గిన జట్టు రాజస్థాన్‌ రాయల్స్.. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్కసారీ కప్‌ను ముద్దాడలేకపోయింది. గత మూడు సీజన్లను అట్టడుగు స్థానాలతోనే ముగించడం విశేషం. అయితే ఈసారి మాత్రం తీవ్రమైన పోటీనిస్తామని రాజస్థాన్‌ రాయల్స్‌ డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌ కుమార సంగక్కర తెలిపాడు. "గత కొన్నేళ్లుగా మా జట్టు సరిగ్గా రాణించలేదని తెలుసు. అందుకే ఐపీఎల్‌ మెగా వేలం కోసం ఆఫ్‌-సీజన్‌లో ఏం చేయాలనే దానిపై కసరత్తు చేశాం. వేలంలో ఆటగాళ్లను ఎంపిక చేసుకునేటప్పుడు మా దృష్టికి అవసరమైన కీలకమైన విషయాలను గుర్తించాం. అందుకే మెగా వేలంలో అనుకున్న లక్ష్యాలను అందుకున్నాం. బలమైన జట్టును ఎంపిక చేశామని భావిస్తున్నాం" అని సంగక్కర వివరించాడు.

జట్టులోకి టీమ్‌ఇండియా టాప్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్‌ అశ్విన్‌ చేరిక గతేడాది ప్రదర్శనకు భిన్నంగా ఉండబోతోందని సంగక్కర అభిప్రాయపడ్డాడు. "అన్ని విభాగాలను పటిష్ఠంగా ఉంచేందుకు ప్రయత్నించాం. నీషమ్, మిచెల్, వాన్‌డర్ డస్సెన్‌తో మిడిలార్డర్‌ బలంగా ఉంది. పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌ సహా బ్యాటింగ్‌లోనూ స్ట్రాంగ్‌ జట్టు. ఈసారి ఎక్కువగా యువ ఆటగాళ్లను తీసుకున్నాం. కోర్‌ ప్లేయర్లను కొనుగోలు చేసుకుని సీజన్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఆటగాళ్లపరంగా ఎలాంటి అనుమానం లేదు. అయితే ఫీల్డ్‌లో ఒత్తిడిని తట్టుకోవడం, ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడమే ప్రస్తుతం కీలకం. ఇక నా కర్తవ్యం మాత్రం ఫ్రాంచైజీకి విలువ తీసుకొచ్చి, మంచి క్రికెటర్లను జట్టులోకి తీసుకునేలా చేయడమే.. దీనిని పూరిస్థాయిలో అమలు చేశానని భావిస్తున్నా’’ అని సంగక్కర పేర్కొన్నాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్‌ 15వ సీజన్‌ ప్రారంభం కానుంది. ముంబయి, పుణెలోని నాలుగు మైదానాల్లో మొత్తం మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించనుంది.

షేన్‌వార్న్‌ మృతి క్రీడాలోకానికి తీరని లోటు

తొలి సీజన్‌లోనే రాజస్థాన్‌ రాయల్స్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ను అందించిన క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్‌ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి షేన్‌వార్న్‌ను సంగక్కర గుర్తు చేసుకున్నాడు. వార్న్‌ లేకపోవడం క్రికెట్‌కు తీరనిలోటని పేర్కొన్నాడు. ఆటపట్ల అంకితభావం, పరిపూర్ణ పరిజ్ఞానం ఉన్న మేధావి, స్నేహితుడైన వార్న్‌ మృతి తీవ్రంగా కలిచివేసిందన్నాడు.

ఇదీ చూడండి: నవ్వుతో మాయ చేస్తున్న సర్ఫర్​!


ABOUT THE AUTHOR

...view details