తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ ప్రారంభానికి ముందే వివాదంలో ధోనీ!

భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ఒప్పో మొబైల్ కంపెనీకి ఇంకా ధోనీ ప్రచారకర్తగా ఉన్నారు. ఈ విషయమై ట్వీట్లు చేస్తూ అతడిని విమర్శిస్తున్నారు పలువురు నెటిజన్లు.

MS Dhoni
ధోనీ

By

Published : Sep 19, 2020, 6:27 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ఐపీఎల్​తో పాటు, ధోనీ రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ముంబయి ఇండియన్స్​తో తొలి మ్యాచ్​ సందర్భంగా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు ధోనీ. కానీ లీగ్ ప్రారంభానికి ముందే అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. చైనా మొబైల్​ కంపెనీ ఒప్పోకు ప్రచారకర్తగా వ్యవహరించాడమే ఇందుకు కారణం.

"క్రికెట్​ మైదానంలో ధోనీని మిస్​ అవుతున్నాం. అద్భుతమైన కెప్టెన్​ నైపుణ్యాలు కలిగిన మహీ మాకు అన్ని అడ్డంకులను ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చారు. మా కాళ్లమీద మేం నిలబడేలా చేశారు. సెప్టెంబరు 24న ధోనీతో మా ఎమోషనల్​ జర్నీ వీడియో విడుదల కానుంది. అందరూ సిద్ధంగా ఉండండి" అని ఒప్పో ట్వీట్ చేసింది. దీంతో ధోనీపై సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తున్నారు.

భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్​గా ఉన్న ధోనీ... ఒప్పో ప్రచారకర్తగా ఎంతవరకు నిబద్ధత పాటిస్తున్నారంటూ అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

భారత్​, చైనా ఉద్రిక్త పరిస్థితులు

గత కొన్ని నెలలుగా చైనా, భారత్​ మధ్య సరిహద్దు వివాదంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే చైనా కంపెనీలు, ఉత్పత్తులపై భారీ ఆంక్షలు విధిస్తోంది కేంద్రం. 58 చైనా యాప్​లను ఈ జూన్​ నుంచి నిషేధించగా.. ఇటీవలే పబ్జీని కూడా బాయ్​కాట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే ఐపీఎల్​ 2020లో టైటిల్​ స్పాన్సర్​షిప్​ నుంచి వివో తప్పుకుంది. ఆ స్థానంలో డ్రీమ్ 11 స్పాన్సర్​షిప్​ దక్కించుకుంది. అయితే, డ్రీమ్ 11లో కొన్ని చైనా కంపెనీలు భాగస్వామ్యం ఉండటం వల్ల కొంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ధోనీ చర్యతో ఆయన ఆభిమానులు నిరాశ చెందుతున్నారు.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details