అబుదాబి వేదికగా పంజాబ్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 48 తేడాతో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయగలిగింది పంజాబ్. రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, జేమ్స్ ప్యాటిన్సన్ తలో రెండు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించారు.
ఫలితంగా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది ముంబయి ఇండియన్స్. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు సాధించింది రోహిత్ సేన. పంజాబ్ ఆరో స్థానంలో ఉంది.
ఆరంభం అదిరినా..
భారీ ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్.. ఆరంభంలో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(25), రాహుల్(17) తొలి వికెట్‌కు 38 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ డకౌటయ్యాడు. అక్కడినుంచి పంజాబ్ స్కోరు బోర్డు నెమ్మదించింది. మిడిలార్డర్లో నికోలస్ పూరన్(44) కాసేపు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయాడు.
మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.
రోహిత్, పొలార్డ్, పాండ్య విజృంభణ..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (70; 45 బంతుల్లో 8x4, 3x6) అర్ధశతకంతో మెరవగా.. చివర్లో కీరన్ పొలార్డ్ (47; 20 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్ పాండ్య (30; 11 బంతుల్లో 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచింది. ఆది నుంచీ కట్టుదిట్టంగా బంతులేసిన పంజాబ్ బౌలర్లు చివర్లో చేతులెత్తేశారు. దీంతో పాండ్య, పొలార్డ్ బౌండరీల వర్షం కురిపించారు. చివరి 6 ఓవర్లలో 104 పరుగులు రాబట్టుకుంది రోహిత్ సేన.