పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడినప్పుడు తన బ్యాట్ ఒక నెల లేదా రెండు నెలల వరకు మాత్రమే మన్నికగా ఉంటుందని రోహిత్ శర్మ తెలిపాడు. ఈ ఐపీఎల్ కోసం తాను తొమ్మిది బ్యాట్లను వెంట తెచ్చుకున్నట్లు వెల్లడించాడు.
"నా బ్యాట్ మన్నిక.. ఫార్మాట్ బట్టి ఆధారపడి ఉంటుంది. నాలుగు నుంచి ఐదు నెలల వరకు పని చేస్తుంది. కానీ టీ20ల్లో మాత్రం చెప్పలేను. ఎందుకంటే బంతులను ఎక్కువగా బాదాల్సి వస్తుంది. నెల రోజులు కూడా పనిచేయడం కష్టమే. అందుకే ముందు జాగ్రత్తగా ఈ సీజన్ కోసం తొమ్మిది బ్యాట్లు నాతో పాటు తెచ్చుకున్నా."