కోల్‌కతా వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోవడంపై ఆ జట్టు సభ్యుడు రసెల్ స్పందించాడు. అనవసర తప్పిదాలే కొంపముంచుతున్నాయని చెప్పాడు. ఈ సీజన్ ప్రారంభంలో అద్భుతంగా రాణించిన రసెల్ 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలుచుకున్నాడు. ఆ తర్వాత జట్టుతో పాటు అతను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు.
"మా జట్టు బలంగా ఉంది. కానీ కొన్ని అనవసర తప్పిదాలు మ్యాచ్‌లను దూరం చేస్తున్నాయి. బౌలింగ్‌లోనూ మేం చేసిన పొరపాట్లే మా కొంపముంచుతున్నాయి. గెలవాల్సిన మ్యాచ్‌ల్ని చాలా తక్కువ తేడాతో ఓడిపోతున్నాం" -ఆండ్రీ రసెల్, కోల్‌కతా ఆల్‌రౌండర్
ప్రస్తుత సీజన్లో పది మ్యాచ్‌లాడిన ఈ కరీబియన్ ఆటగాడు 209.27 స్ట్రైక్ రేట్‌తో 406 పరుగులు చేశాడు.
"బలహీన బ్యాటింగ్ ఆర్డర్ కారణంగా రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 176 పరుగులు లక్ష్యాన్ని ఛేదించలేకపోయాం. వారిని 170 పరుగుల లోపే కట్టడి చేయగలిగితే ముంబయి లాంటి బలమైన జట్లపైనా మా బౌలింగ్‌తో అద్భుతాలు చేయొచ్చు. వారు మేం బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. కానీ అసలు సమస్య ఏంటంటే ప్రత్యర్థిని ఎక్కువ పరుగులు చేయకుండా ఆపలేకపోతున్నాం. ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాం. రానున్న 3 మ్యాచ్‌ల్ని గెలిచితీరుతాం"
-ఆండ్రీ రసెల్, కోల్‌కతా ఆల్‌రౌండర్