తెలంగాణ

telangana

ETV Bharat / sports

అఫ్గాన్​ సారథిగా అస్గర్​నే ఉంచండి : రషీద్​

అఫ్గానిస్థాన్​ ఆటగాడు రషీద్​ ఖాన్​... ఆ దేశ ప్రపంచ కప్​ జట్టు కూర్పుపై స్పందించాడు. వన్డేలకు కెప్టెన్​గా ఉన్న అస్గర్​పై వేటు వేయడంపై అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఆఫ్గాన్​ సారథిగా అస్గర్​నే ఉంచండి : రషీద్​

By

Published : Apr 6, 2019, 6:01 AM IST

ఇంగ్లండ్‌, వేల్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌కు... అఫ్గాన్‌ జట్టును ఎంపిక చేశారు సెలక్టర్లు. ప్రస్తుతం కెప్టెన్​గా ఉన్న అస్గర్​పై వేటు వేసి గుల్బాదిన్​ నైబ్​కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నిర్ణయంపై అఫ్గాన్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​ స్పందించాడు.

జట్టునుప్రస్తుత కెప్టెన్​ బాగానే నడిపిస్తున్నాడని, మెగా టోర్నీ ముందు ఇలాంటి నిర్ణయం సరైనది కాదని అభ్యంతరం వ్యక్తం చేశాడు.

రషీద్ ఖాన్​ ట్వీట్​
  • మూడు ఫార్మాట్‌లకు వేర్వేరు సారథులు ఉండాలని సెలక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వన్డేలకు గుల్బాదిన్​ నైబ్​ను, టీ20లకు రషీద్‌ ఖాన్‌ను, టెస్టులకు రహమ్‌త్‌ షా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ప్రపంచకప్‌లో పాల్గొనే అఫ్గాన్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా రషీద్​ఖాన్​నే ఎంపిక చేసింది బోర్డు. దీనికి కారణం కొంత కాలంగా అన్ని ఫార్మాట్లలోనూ రషీద్​ అద్భుత ప్రదర్శన కనబరుస్తుండడమే.
    సారథుల పేర్లు ప్రకటించిన ఆఫ్గాన్​ బోర్డు

ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా ఆఫ్గాన్‌ జట్టు... ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌లతో మ్యాచ్​లు ఆడనుంది. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్​ ఆస్ట్రేలియాతో జూన్‌ 1న తలపడనుంది. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌లో భాగస్వామ్యం వహించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది అఫ్గానిస్థాన్​​.

ABOUT THE AUTHOR

...view details