తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో కోహ్లీ అరుదైన ఘనత - ఆర్సీబీ

బెంగళూరు జట్టు కెప్టెన్  విరాట్ కోహ్లీ.. ఐపీఎల్​లో 5000 పరుగుల మార్క్​ను అందుకున్నాడు. రైనా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్​మెన్​గా నిలిచాడు.

కోహ్లీ

By

Published : Mar 29, 2019, 8:55 AM IST

గురువారం బెంగళూరు వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. 46 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద... ఐపీఎల్​లో 5000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్​మెన్​గా నిలిచాడు. వారం క్రితమే సురేశ్ రైనా ఈ ఘనత సాధించాడు.

రైనా 177 మ్యాచ్​ల్లో ఈ ఘనత సాధిస్తే, కేవలం 165 మ్యాచ్​ల్లోనే ఈ స్కోరు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు విరాట్ కోహ్లీ.

ఈ ఐపీఎల్​ సీజన్​ ప్రారంభమయ్యే నాటికి 4948 పరుగులతో ఉన్నాడు. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్​లోనే కోహ్లీ ఈ రికార్డు సాధించేవాడు. కానీ 6 పరుగులే చేసి ఔటయ్యాడు. అదే మ్యాచ్​లో చెన్నై బ్యాట్స్​మెన్ సురేశ్ రైనా... 5000 పరుగుల చేసి ఈ ఘనతను సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details