తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ - ఎస్​ఆర్​హెచ్​

ఉప్పల్ వేదికగా కోల్​కతాతో జరుగుతున్న మ్యాచ్​లో హైదరాబాద్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు చెరో నాలుగు మ్యాచ్​లు గెలిచి 8 పాయింట్లతో సమానంగా ఉన్నాయి.

టాస్

By

Published : Apr 21, 2019, 3:45 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్​తో తలపడుతున్న మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​ ఇరు జట్లకు కీలకం కానుంది. చెరో నాలుగు మ్యాచ్​లు గెలిచి 8 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్​లో విజయం సాధించి ప్లే ఆఫ్​కు మార్గం సుగమం చేసుకోనున్నాయి.

పిచ్​ పొడిగా ఉంది కాబట్టి స్లో బౌలర్లకు అనుకూలించే అవకాశముంది. కోల్​కతా జట్టులో మూడు మార్పులు చేసింది. ఊతప్ప, కుల్దీప్, ప్రసిధ్ కృష్ణ స్థానంలో రింకూ సింగ్​, కరియప్ప, పృథ్వీరాజ్​లు ఆడనున్నారు.

ఇప్పటికే ఈ రెండింటి మధ్య జరిగిన తొలి మ్యాచ్​లో కోల్​కతా విజయం సాధించింది. హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన కోల్​కతా ఇందులో ఎలాగైన నెగ్గాలనుకుంటోంది. గత మ్యాచ్​లో చెన్నైపై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది సన్​రైజర్స్ జట్టు.

జట్లు

కోల్​కతా నైట్ రైడర్స్

సునిల్ నరైన్, దినేష్ కార్తీక్ (కెప్టెన్, కీపర్), పీయుష్ చావ్లా, కరియప్ప, క్రిస్ లిన్, ఆండ్రీ రసెల్, రింకూ సింగ్, నితీష్ రానా, పృథ్వీ రాజ్, శుభమన్ గిల్, హారీ గుర్నే.

సన్ రైజర్స్ హైదరాబాద్

విలియమ్సన్(కెప్టెన్), వార్నర్, బెయిర్ స్టో(కీపర్), విజయ్ శంకర్, సందీప్ శర్మ, నదీమ్, దీపక్ హుడా, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, యూసుఫ్ పఠాన్, భువనేశ్వర్ కుమార్

ABOUT THE AUTHOR

...view details