తెలంగాణ

telangana

ధోనీ తీరుపై మాజీ క్రికెటర్ల విమర్శలు

By

Published : Apr 12, 2019, 3:02 PM IST

రాజస్థాన్​ రాయల్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ మ్యాచ్​లో ధోనీ డగౌట్​ నుంచి మైదానంలోకి వెళ్లడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు. ధోనీ సహనం కోల్పోయాడని కొందరు అనగా... ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మరికొందరు కోరారు.

former-cricketers-reacts-on-dhoni

రాజస్థాన్​ రాయల్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ మ్యాచ్​లో ఇంగ్లండ్​ ఆల్​రౌండర్​ వేసిన బంతి నోబాల్​ కావడంపై నాన్​ స్ట్రయికర్​ బ్యాట్సెమన్ జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే డగౌట్​లో ఉన్న ​ధోనీ... గ్రౌండ్​లోకి వచ్చి అంపైర్లతో వాదించాడు. ఫలితంగా మ్యాచ్​ ఫీజులో 50శాతం కోత రూపంలో శిక్ష ఎదుర్కొన్నాడు. ధోనీ ప్రవర్తించిన తీరుపై రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు బట్లర్​ విమర్శలు గుప్పించాడు.

' నేను బౌండరీ దగ్గర ఫీల్డింగ్​లో ఉన్నాను. నిజానికి పిచ్​ వద్ద ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నా అభిప్రాయం ప్రకారం ధోనీ గ్రౌండ్​లోకి అడుగుపెట్టడం మంచి పని కాదు '.
-- జోస్​ బట్లర్​, రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు​

బట్లర్​తో పాటు మరికొందరు మాజీలు ట్విట్టర్​ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details