సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 132 పరుగులు చేసింది. ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చినా మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. షేన్ వాట్సన్ (31; 29 బంతుల్లో 4ఫోర్లు), డుప్లెసిస్ (45; 31 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సులు) దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఈ ఏడాది చెన్నై తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (79) నెలకొల్పారు. నదీమ్ బౌలింగ్‌లో వాట్సన్ ఔటైన తరువాత ఇన్నింగ్స్ మలుపు తిరిగింది.
మిడిలార్డర్ వైఫల్యం...
చెన్నై మిడిలార్డర్ హైదరాబాద్ బౌలింగ్‌కు కుప్పకూలింది. సురేశ్ రైనా (13; 13 బంతుల్లో 2×4), కేదార్ జాదవ్ (1; 2 బంతుల్లో) తక్కువకే ఔటవ్వడంతో భారీ స్కోరు చేయలేక చతికిలపడింది సూపర్‌కింగ్స్. ధోని స్థానంలో జట్టులోకొచ్చిన సామ్ బిల్లింగ్స్ డకౌటై నిరాశపరిచాడు. జడేజా 20 బంతులాడి 10 పరుగులు మాత్రమే చేశాడు.
హైదరాబాద్ బౌలర్లలో రషీద్ 2 వికెట్లు తీశాడు. ఖలీల్, నదీమ్, విజయ్ శంకర్ తలో వికెట్ తీశారు.
సన్‌రైజర్స్‌కు మద్దతుగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించింది.