తెలంగాణ

telangana

అతడు ఒక్క ఇన్నింగ్స్​ ఆడితే చాలు.. లెక్క సరిపోతుంది: రోహిత్

By

Published : Feb 25, 2022, 1:37 PM IST

Rohit Sharma on Ishan Kishan: టీమ్ ఇండియా ఓపెనర్ ఇషాన్ కిషన్​పై సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఇషాన్ రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. అతడి బ్యాటింగ్​ను అవతలి ఎండ్​ నుంచి చూడడం అద్భుతంగా ఉందన్నాడు.

ishan kishan
ఇషాన్ కిషన్

Rohit Sharma on Ishan Kishan: శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించడంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌పై ప్రశంసలు కురిపించాడు. చాలా కాలంగా అతడు తెలుసని, అతడి మనస్తత్వం కూడా తాను అర్థం చేసుకున్నానని రోహిత్‌ పేర్కొన్నాడు. అలాగే అతడికుండే శక్తి సామర్థ్యాలు కూడా తెలుసన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌ సిరీస్‌లో పరుగులు చేయలేక ఇబ్బందులు పడిన ఇషాన్‌కు ఇలాంటి ఒక ఇన్నింగ్స్‌ ఆడితే సరిపోతుందని తెలిపాడు. అవతలి ఎండ్‌ నుంచి అతడి బ్యాటింగ్‌ను చూడటం అద్భుతంగా ఉందన్నాడు. అనంతరం జడేజాపై మాట్లాడిన కెప్టెన్‌.. అతడు తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉందని చెప్పాడు.

"జడేజా నుంచి చాలా ఆశిస్తున్నాం. అందుకే అతడిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు తీసుకొచ్చాం. రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటివి మరిన్ని చూస్తారు. అతడు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు వచ్చి పరుగులు చేయాలని నేను అనుకుంటున్నా. బ్యాటింగ్‌లో చాలా మెరుగయ్యాడు. దీంతో రాబోయే మ్యాచ్‌ల్లో అతడిని ముందే బ్యాటింగ్‌కు పంపిస్తాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడి నుంచి మేం ఏం సాధించాలనే విషయంపై కచ్చితమైన స్పష్టతతో ఉన్నాం" అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. అలాగే తనకు పెద్ద గ్రౌండ్లలో ఆడాలంటే ఇష్టమని, అక్కడే ఒక బ్యాట్స్‌మన్‌ శక్తి సామర్థ్యాలు ఏంటనేవి తెలుస్తాయన్నాడు. మరోవైపు ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు వదిలేయడంపై మాట్లాడుతూ దానిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాకు వెళ్లేసరికి టీమ్‌ఇండియా ఈ విభాగంలో బలమైన జట్టుగా మారాలని ఆకాక్షించాడు.

ఇదీ చదవండి:ఐపీఎల్ ఫ్యాన్స్ గెట్​ రెడీ.. మార్చి 26 నుంచి మ్యాచ్​లు

ABOUT THE AUTHOR

...view details