తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిరీస్​లో నిలవాలంటే.. గెలవాల్సిందే! జట్టులో కీలక మార్పులకు ఛాన్స్ - australia vs india

Ind vs Aus 2nd T20 : టీ20 ప్రపంచకప్​కు​ ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్​లో టీమ్​ ఇండియా ఆడిన మొదటి మ్యాచ్​లో ఓటమి పాలైంది. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారని ఆశించినప్పటికి వారికి నిరాశే ఎదురైంది. మొదటి మ్యాచ్​లో తగ్గినా మళ్లి నెగ్గుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

TEAMINDIA VS AUSTRALIA SECOND T20 MATCH PREVIEW
TEAMINDIA VS AUSTRALIA SECOND T20 MATCH PREVIEW

By

Published : Sep 23, 2022, 1:38 PM IST

Ind vs Aus 2nd T20 :ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్​లో భారత్​ పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ సిరీస్​లో నిలవాలంటే శుక్రవారం జరగబోయే మ్యాచ్​లో భారత్​ తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలోనే మొదటి మ్యాచ్​లో వచ్చిన చేదు అనుభవాలను సమీక్షిస్తున్న జట్టు యాజమాన్యం ఈ సారి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని ఆలోచిస్తోంది. శుక్రవారం (సెప్టెంబర్ 23) నాగ్‌పుర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనున్న రెండో మ్యాచ్‌కు భారత్​ ఆస్ట్రేలియా జట్లు బరిలోకి దిగనున్నాయి. ఆస్ట్రేలియాతో పోటిపడి టీ20 సిరీస్‌లో నిలదొక్కుకోవాలని భారత్ చూస్తోంది.

  • ఫీల్డ్‌లో తప్పిదాల కారణంగా ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడిపోయినా, లైనప్‌తో భారత్ కనువిందు చేస్తుంది.
  • ఈ మ్యాచ్​లో భారత్​ మంచి స్కోరు (208/6) సాధించినప్పటికీ బౌలింగ్, ఫీల్డింగ్​ జట్టును నిరాశపరిచింది. ఈ విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది.
  • ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్​నెస్​ గురించి ఇప్పుడు ఫ్యాన్స్​లో ఆందోళన మొదలైంది. 2022 జూలైలో ఇంగ్లాండ్‌తో చివరిసారిగా టీ20 ఆడిన బుమ్రా గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ కోసం బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు, కానీ ప్రారంభ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే రెండో, మూడో టీ20 మ్యాచ్‌ల్లో బుమ్రా ఆడోచ్చని రోహిత్‌ చెప్పాడు.
  • బుమ్రాను ఉమేశ్‌ స్థానంలో తీసుకునే అవకాశాలున్నాయి. ఇవి మినహా టీమ్​లో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని సమాచారం.
  • ఆసీస్‌తో తొలి టీ20లో రిషభ్ పంత్​కు బదులు దినేశ్‌ కార్తీక్‌ను జట్టులోకి తీసుకున్నా అతను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కీపింగ్‌లో పెద్దగా మాయ చేయని కార్తీక్‌.. బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. కేవలం 6 పరుగులకే ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో రెండో టీ20లో అతడి స్థానంలో పంత్‌ను తీసుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
  • సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో అతడిని పక్కన పెట్టాలనే అభిప్రాయాలున్నాయని సమాచారం.
  • మరోవైపు, ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జట్టు మొదటి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, ఆస్ట్రేలియా పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇందులో వారి మిడిల్ ఆర్డర్ సమస్య కూడా ఉంది.
  • విశ్రాంతి తీసుకున్న డేవిడ్ వార్నర్​ స్థానంలో వచ్చిన కేమరూన్ గ్రీన్ అద్భుత ప్రదర్శన కనపరిచాడు. కానీ స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్‌లతో కూడిన మిడిల్ ఆర్డర్ విఫలమవ్వడం వల్ల టీమ్​ సందిగ్ధంలో పడిపోయింది.

భారత జట్టు అంచనా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, యుజువేంద్ర చాహల్‌

ఆస్ట్రేలియా జట్టు అంచనా: ఆరోన్ ఫించ్ (సి), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్), పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

ఇవీ చదవండి:నా ప్రశ్నలకు మేనేజ్​మెంట్​ సమాధానం చెప్పాలి : సునీల్ గావస్కర్‌

ఐసీసీ ఛైర్మన్‌ పదవిపై గంగూలీ రియాక్షన్ ఇదే

ABOUT THE AUTHOR

...view details