ఇటీవల పురుషుల వన్డేలో మహిళా అంపైర్ (క్లేర్ పొలొసాక్)ను మరువక ముందే మరోసారి మహిళకు కీలక పదవినిచ్చింది ఐసీసీ. తాజాగా అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీల ప్యానెల్లో మాజీ క్రికెటర్ జీ ఎస్ లక్ష్మీని నియమించింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సాధించింది లక్ష్మీ. ఈ నిర్ణయంతో ఆమెకు అంతర్జాతీయ మ్యాచుల్లో రిఫరీగా పనిచేసే అవకాశం దక్కింది.
"అంతర్జాతీయ రిఫరీ ప్యానెల్లో అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. భారత క్రికెటర్గా, మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వహించాను. నాకు దక్కిన ఈ గౌరవాన్ని నా అనుభవంతో సక్రమంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తాను" - జీ ఎస్ లక్ష్మీ, భారత మాజీ క్రికెటర్, రిఫరీ