తెలంగాణ

telangana

ETV Bharat / sports

"మెగాటోర్నీకి వేరే వ్యూహాలు"

ప్రపంచకప్​లో అమలు పరిచే వ్యూహాలు వేరుగా ఉన్నాయని, ఆస్ట్రేలియాతో మ్యాచ్​ల ప్రభావం మెగా టోర్నీపై ఉండదని టీమిండియా బౌలింగ్​ కోచ్ భరత్ అరుణ్ తెలిపారు.

By

Published : Mar 12, 2019, 11:46 PM IST

భరత్ అరుణ్

ఆస్ట్రేలియాతో సిరీస్​లోని జట్టు కూర్పులను ప్రపంచకప్​లో వినియోగించకపోవచ్చని భారత జట్టు బౌలింగ్​ కోచ్ భరత్ అరుణ్ తెలిపారు. మెగాటోర్నీని దృష్టిలో ఉంచుకొని జట్టు గెలిచేందుకు అన్ని ప్రయోగాలు చేశామని చెప్పారు.

మే 30 నుంచి ఇంగ్లండ్​ వేదికగా జరగనున్న ప్రపంచకప్​లో జట్టు కూర్పుపై ఎలాంటి ఆందోళన లేదని తెలిపారు. ఇంగ్లీష్ గడ్డపై సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులకు తగట్టుగా అన్ని అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.

టీమిండియా విజయాల రేటు 75శాతం ఉందనే విషయాన్ని మరువకూడదని బదులిచ్చారు అరుణ్. ఏ జట్టుకు ఇన్ని విజయాలు లేవని గుర్తు చేశారు. మెగాటోర్నీ ముందే జట్టులో లోపాలను సరిచేసుకునే అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

ధోనీతో పోల్చొద్దు..

ధోనీతోపంత్​ను పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు భరత్ అరుణ్. ఇద్దరూ విభిన్నమైన ఆటగాళ్లు. మహీ వికెట్​ కీపింగ్​తో పాటు జట్టు వ్యూహాలను సమర్థంగా అమలుచేయగలడు. కఠినపరిస్థితుల్లో విరాట్​కు ధోనీ సలహాలు ఉపకరిస్తాయి.

నాలుగో వన్డేలో టర్నర్​ను స్టంపౌట్​​ చేయడంలో రిషభ్ పంత్ విఫలమయ్యాడు. దీంతో పంత్​పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కంగారూలతో రేపు జరగబోయే ఐదో వన్డేలోనూ సత్తా చాటి సిరీస్ కైవసం చేసుకుంటామని భరత్ అన్నారు. బౌలింగ్, బ్యాటింగ్​లో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమిస్తామని తెలిపారు. నాలుగో వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన టర్నర్​ను ఔట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details