india cricket team slip fielders : టెస్టు క్రికెట్లో ట్రైన్ పొజిషన్లో నిలబడే స్లిప్ ఫీల్డర్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాంగ్ ఫార్మాట్లో ఈ స్లిప్ ఫీల్డింగ్ ఎంతో కీలకం. దీనిని స్లిప్ కార్డన్ అని పిలుస్తారు. బంతిని సంధించడానికి బౌలర్ పరుగు ప్రారంభించగానే.. ఎడ్జ్ తీసుకొని వచ్చే క్యాచ్‌ల కోసం స్లిప్‌లో ఉన్న ప్లేయర్సంతా రెడీగా ఉంటారు. అసలీ ఫీల్డింగ్ చేయడానికి స్టార్ ఆటగాళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రత్యేకంగా ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. మరి ఈ ఫీల్డింగ్ ప్లేస్‌లో టీమ్ఇండియాలో ఎవరు ఉంటే బాగుంటుందో సమాధానం చెప్పింది ఛాట్‌జీపీటీ. వారెందుకు ఈ స్లిప్ ఫీల్డింగ్‌లో ఉండాలో కూడా వివరించింది.
- విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్‌లో పరుగుల వరద పారింటే విరాట్ కోహ్లీ.. స్లిప్ ఫీల్డింగ్‌లో కూడా చురుగ్గా ఉంటాడు.
- అజింక్య రహానె.. టీమ్ఇండియాలో స్లిప్ కార్డన్ రెగ్యులర్ ఫీల్డర్ల జాబితాలో అజింక్య రహానె పేరు కచ్చితంగా ఉంటుంది. మ్యాచుల్లోని కీలక సందర్భాల్లో క్యాచులు అందుకుని చాలా సార్లు గెలిపించాడు.
- ఛెతేశ్వర్ పుజారా.. క్రీజులో గంటల తరబడి ఉండి బ్యాటింగ్ చేసేది.. టీమ్ఇండియాలో ఛెతేశ్వర్ పుజారా. అతడికి స్లిప్ ఫీల్డర్‌కు ఉన్న లక్షణాలు బాగా ఉన్నాయి. టెక్నిక్, ఏకాగ్రత అతడిలో ఎక్కువగా ఉన్నాయి. అదే అతడిని బెస్ట్ స్లిప్ ఫీల్డర్‌ను చేసింది.
- రోహిత్ శర్మ.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. బంతిని గమనించి వేగంగా రియాక్ట్ అవ్వగలడు. బంతిని అందుకోవడంలో చూపించే అతడి బాడీ లాంగ్వేజ్.. ఈ జాబితాలోకి తీసుకొచ్చింది.
- శిఖర్ ధావన్.. టీమ్ఇండియా విదేశాల్లో పర్యటించేటప్పుడు.. బెస్ట్ స్లిప్ ఫీల్డర్ అంటే శిఖర్ ధావన్. అక్కడి పిచ్‌లకు శిఖర్ స్లిప్ ఫీల్డింగ్ సరిగ్గా సరిపోతుంది. గతంలో విదేశీ గడ్డపై ఆడన సిరీస్‌ల్లో శిఖర్ మంచి క్యాచ్‌లను అందుకున్నాడు.
ఇక టీమ్ఇండియా విషయానికొస్తే.. ప్రస్తుతం ఓవల్ స్టేడియం వేదికగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ 2023(డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడుతోంది. మొదటి రెండు రోజుల ఆటతో పోలిస్తే.. మూడో రోజు టీమ్ఇండియా కాస్త పర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. అయినప్పటికీ మూడు రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. 296 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆ జట్టు.. నాలుగు రోజు ఆటలో కూడా చెలరేగి 400 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించేలా కనిపిస్తోంది. ఈ ఛేదన భారత్‌కు కఠిన సవాల్ లాంటిది. ఎందుకంటే..
Oval highest Run Chase In Tests : ఓవల్ స్టేడియం రికార్డులను ఓ సారి చూస్తే.. చివర్లో అద్భుతాలను చేసిన జట్టే గెలిచాయి. అందులోనూ ఈ మైదానంలో అత్యధిక ఛేదన ఇప్పుటివరకు 263 మాత్రమే. అది కూడా 121 ఏళ్ల కిందట జరిగిన మ్యాచ్‌లో ఈ ఛేదన నమోదైంది. ఇందులో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ గెలిచింది. చూడాలి మరి ఇప్పుడు జరుగుతున్న డబ్ల్యూటీసీలో ఏం జరుగుతుందో..