తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind Vs Pak Asia Cup 2023 : క్రికెట్​ లవర్స్​కు షాకింగ్​ న్యూస్​.. సెప్టెంబర్​ 2 భారత్​ - పాక్​ మ్యాచ్​ లేనట్టేనా ? - ఆసియా కప్​ 2023 టీమ్​ఇండియా

Ind Vs Pak Asia Cup 2023 : 2023 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ఆసియా కప్​కు బుధవారం తెరలేవనుంది. పాకిస్థాన్​లోని ముల్తన్​ క్రికెట్​ స్టేడియం వేదికగా జరగనున్న ఈ తొలి పోరు కోసం పాక్​- నేపాల్​ జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇండియా పాకిస్థాన్​ మధ్య సెప్టెంబర్​ 2న తొలి మ్యాచ్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్​ లవర్స్​ను ఓ విషయం ఆందోళన కలిగిస్తోంది. అదేంటంటే..

Asia cup  ind vs pak
Asia cup ind vs pak

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 1:55 PM IST

Ind Vs Pak Asia Cup 2023 : ప్రతిష్టాత్మక ఆసియా కప్​కు బుధవారం తెరలేవనుంది. పాకిస్థాన్​లోని ముల్తన్​ క్రికెట్​ స్టేడియం వేదికగా జరగనున్న ఈ తొలి పోరు కోసం పాక్​- నేపాల్​ జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే రెండు జట్లు పాకిస్థాన్​కు పయనమవ్వగా.. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్​ ప్రారంభం కానుంది.

అయితే ఆసియా కప్​లో ఆరు జట్లు పోటీ పడనుండగా.. అందరి దృష్టి మాత్రం ఇండియా పాకిస్థాన్​ మ్యాచ్​లపైనే ఉంది. సాధారణంగా ఈ రెండు జట్ల మధ్య ఏడాదికి ఒక్క మ్యాచ్‌‌‌‌ జరిగితేనే ఫ్యాన్స్ ఎంతో​ ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటిది ఇప్పుడు రెండు వారాల్లో మూడు సార్లు ఇండో–పాక్‌‌‌‌ వార్​ ‌క్రికెట్​ లవర్స్​ను అలరించనుంది. ఈ క్రమంలో తొలి పొరు సెప్టెంబర్​ 2న ఆరంభం కానుంది. శ్రీలంకలోని పల్లెకలె వేదికగా జరగనున్న ఈ ఉత్కంఠ మ్యాచ్​ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే అంతా రెడీగా ఉందన్న తరుణంలో ఒక్క విషయం అభిమానులను ఆందోళను కలిగిస్తోంది. అదే శ్రీ లంక వాతావరణం. తాజా నివేదికల ప్రకారం క్యాండీలో పిడుగులతో కూడిన వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణలు చెబుతున్నారు. 90 శాతం వరకు వర్షం పడేలా ఉందట. దీంతో ఈ మ్యాచ్​ సెప్టెంబర్​ 2 జరిగే అవాకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.

Asia Cup Records : ఆసియాకప్​నకు వేళైంది.. ఈ 10 ఇంట్రెస్టింగ్​ పాయింట్స్​, రికార్డ్స్​ తెలుసా?

Asia Cup 2023 : ఆసియా కప్​నకు రంగం సిద్ధం.. ఈ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్​ వీరే!

ABOUT THE AUTHOR

...view details