IND VS BAN: ముగిసిన మూడో రోజు ఆట.. నాలుగేళ్ల తర్వాత పుజారా సెంచరీ.. బంగ్లా లక్ష్యం ఎంతంటే?
15:21 December 16
పుజారా సెంచరీ
భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసమయానికి 12 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. మిగిలిన రెండు రోజుల్లో ఇంకా 471 పరుగులు చేస్తే బంగ్లా విజయం సాధిస్తుంది.
అంతకుముందు శుబ్‌మన్ గిల్(110), ఛెతేశ్వర్ పుజారా(102**) శతకాలు సాధించారు. గిల్ కిది తొలి సెంచరీ కాగా.. పుజారా దాదాపు నాలుగేళ్ల(1443 రోజులు) తర్వాత టెస్టుల్లో శతకం బాదడం విశేషం. ఇకపోతే తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 404 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 150 రన్స్‌కే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 258/2 స్కోరుకు డిక్లేర్డ్ చేసింది.
ఇదీ చూడండి:ధోనీ, రోహిత్, కోహ్లీ కాదు.. ఆ క్రికెటర్ గురించి ఎక్కువ వెతికారట!