Ind Vs Afg Super Over:భారత్- ఆఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్లో టీమ్ఇండియా 10 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే రెండు సూపర్ ఓవర్లలోనూ రోహిత్ బ్యాటింగ్ చేయండం ప్రస్తుతం నెట్టింట చర్చనీయంగా మారింది. దీనిపై టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.
తొలి సూపర్ ఓవర్లో ఆఖరి బంతికి రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా గ్రౌండ్‌ను వీడాడు. రెండో సూపర్లోనూ రోహిత్ బ్యాటింగ్‌కు వచ్చి సిక్స్, ఫోర్ సహా 11 పరుగులు చేశాడు. రూల్స్ ప్రకారం ఏ ఆటగాడైనా ఓ సూపర్ ఓవర్లో ఔటైతే మరో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయరాదు. అయితే దీనిపై ద్రవిడ్ మాట్లాడాడు. రోహిత్ నిర్ణయాన్ని ద్రవిడ్ ప్రశంసించాడు. 'ఈ మ్యాచ్‌లో రోహిత్ తనను తానుగా రిటైర్డ్ హర్ట్‌గా ప్రకటించుకొని తప్పుకున్నాడు. అతడు అశ్విన్‌లాగా ఆలోచించాడు (2022 ఐపీఎల్లో అశ్విన్ కూడా సూపర్ ఓవర్లో ఇలాగే రిటైర్ హర్ట్ అయ్యాడు అని గుర్తుచేశాడు)' అని అన్నాడు.
ఐసీసీ రూల్స్ ప్రకారం ప్లేయర్ రిటైర్డ్ హర్ట్‌గా క్రీజును వీడితే మళ్లీ బ్యాటింగ్‌కు రావచ్చు. అదే రిటైర్ట్ ఔట్‌గా వెనుదిరిగితే మాత్రం మళ్లీ బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉండదు. అయితే ఫీల్డ్ అంపైర్లు రోహిత్ రిటైర్డ్ హర్డ్/ ఔట్ ఏది అన్న విషయాన్ని కన్ఫార్మ్ చేయలేదు. దీంతో రోహిత్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ విషయంపై ప్రత్యర్థి జట్టు కెప్టెన్ లేదా కోచ్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోతే బ్యాటర్ మళ్లీ క్రీజులోకి రావచ్చని మ్యాచ్ అనంతరం రిఫరీ క్లారిటీ ఇచ్చారు. అయితే అఫ్గాన్ కోచ్ జనొథన్ ట్రాట్‌కు సూపర్ ఓవర్ రూల్స్‌పై అవగాహన లేకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది.