Top Five Fielders In World cup : భారత్ వేదికగా ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. 2011 లో శ్రీలంక, బంగ్లాదేశ్ తో కలిసి నిర్వహించిన ఈ టోర్నీకి తొలిసారి సారి మన దేశం సొంతంగా ఆతిథ్యమిస్తోంది. ఇక ఇందులో పాల్గొంటున్న ప్రతి జట్టు కప్పును గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకే ఈ టోర్నీ కోసం అన్ని జట్లు పటిష్ఠ బ్యాటర్లు, బౌలర్లతో పాటు అత్యుత్తమ ఫీల్డర్లను ఎంపిక చేశాయి. ఎందుకంటే.. కొన్ని సార్లు పరుగులు ఆపడం వల్లా మ్యాచ్ ఫలితాలు తలకిందులైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ చరిత్రలో టాప్ 5 ఫీల్డర్లు ఎవరో ఓ సారి చూద్దాం..
1. రికీ పాంటింగ్
ప్రపంచ కప్ చరిత్రలో అత్యుత్తమ ఫీల్డర్ల గురించి చర్చించినప్పుడు.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరు ఆ జాబితాలో టాప్లో ఉంటుంది. ఆ జట్టులకు రెండు వరల్డ్ కప్పులు అందించిన ఘనత అతని సొంతం. 1996 నుంచి 2011 వరకు జరిగిన టోర్నీల్లో ఆడిన పాంటింగ్.. మొత్తం 46 మ్యాచుల్లో పాల్గొన్నాడు. అందులో 28 క్యాచులు అందుకున్నాడు. దాదాపుగా ప్రతి మ్యాచులో 3 క్యాచులు అందుకున్నాడు. క్యాచెస్ అందుకునే విషయంలో అతని యావరేజ్ 0.608.
2. జో రూట్
ఇంగ్లాండ్కు చెందిన ఈ ఆటగాడు.. వరల్డ్ కప్ టాప్ - 5 ఫీల్డర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రూట్ ఇప్పటి వరకు 2015, 2019 వరల్డ్ కప్ లలో పాల్గొన్నాడు. మొత్తం 17 మ్యాచులు ఆడిన అతను.. 20 క్యాచెస్ అందుకున్నాడు. ఇతను కూడా దాదాపు ప్రతి మ్యాచ్ లో మూడేసి క్యాచులు పట్టాడు. క్యాచెస్ యావరేజ్ 1.176 గా ఉంది.
3. సనత్ జయసూర్య
శ్రీలంక జట్టు మాజీ ఓపెనర్, వెటరన్ బ్యాటర్ సనత్ జయసూర్య ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు. ఒంటిచేత్తో శ్రీలంక జట్టును ఎన్నో సార్లు గెలిపించాడు. ఇతను 1992 నుంచి 2007 వరకు టోర్నీల్లో పాల్గొన్నాడు. మొత్తం 38 మ్యాచులు ఆడగా.. అందులో 18 క్యాచెస్ అందుకున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్ లో రెండు క్యాచులు పట్టాడు. ఇతని క్యాచెస్ యావరేజీ 0.473.