తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC Rankings: టేలర్ డబుల్ ధమాకా.. దిగువకు మిథాలీ

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​(ICC Rankings)లో టీమ్​ఇండియా మహిళా సారథి మిథాలీ రాజ్​ రెండుకు పడిపోయింది. వెస్టిండీస్ మహిళల జట్టు​ కెప్టెన్ స్టెఫానీ టేలర్‌ అగ్రస్థానానికి చేరుకుంది. టీ20 ర్యాంకింగ్స్​లో భారత ప్లేయర్​ షెఫాలీ వర్మ తొలి ర్యాంకులోనే కొనసాగుతోంది.

mithali raj
మిథాలీ, స్టెఫానీ టేలర్‌

By

Published : Jul 13, 2021, 5:05 PM IST

ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో(ICC Rankings) వెస్టిండీస్ మహిళల జట్టు​ సారథి స్టెఫానీ టేలర్‌ దూసుకెళ్లింది. వన్డే బ్యాట్స్​ఉమెన్ జాబితాలో నాలుగు, ఆల్​రౌండర్​ విభాగంలో రెండు స్థానాలను మెరుగుపరుచుకుని 766, 435 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో తొలి ర్యాంకుల్లో ఉన్న టీమ్​ఇండియా మహిళా కెప్టెన్​ మిథాలీ రాజ్(బ్యాటింగ్​ విభాగం)​, ఆస్ట్రేలియా ప్లేయర్​ ఎల్లిస్​ పెర్రీ(ఆల్​రౌండర్ విభాగం​) రెండో స్థానానికి పడిపోయారు.

ప్రస్తుతం పాకిస్థాన్​తో సిరీస్​ ఆడుతోంది విండీస్. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన తొలి వన్డేలో తమ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో టేలర్​ కీలకంగా వ్యవహరించింది. మూడు వికెట్లు తీయడం సహా సెంచరీ(105) బాదింది. ఫలితంగా అటు బ్యాటింగ్, ఇటు ఆల్​రౌండర్ విభాగాల్లో తొలి స్థానానికి ఎగబాకింది. ఇక భారత బ్యాట్స్​ఉమెన్ విషయానికి వస్తే.. బ్యాటింగ్ విభాగంలో స్మృతి మంధాన( 701 పాయింట్లు) తొమ్మిదో ర్యాంకులో, ఆల్​రౌండర్​ విభాగంలో దీప్తిశర్మ(331 పాయింట్లు) ఐదో స్థానంలోనే కొనసాగుతున్నారు.

బౌలింగ్ విభాగం టాప్​-10లో ఎలాంటి మార్పు లేదు. జూలన్​ గోస్వామి(694 పాయింట్లు, 5వ స్థానం), పూనమ్​ యూదవ్​(617 పాయింట్లు, 9 స్థానం), ఆస్ట్రేలియా క్రికెటర్లు జెస్​ జొనాస్సెన్​ (808 పాయింట్లు, 1), మేఘన్​ షట్​(762 పాయింట్లు, 2) తమ స్థానాల్లోనే నిలిచారు.

వన్డే ర్యాంకింగ్స్​

టీ20 ర్యాంకింగ్స్​

​బ్యాటింగ్​ విభాగంలో టాప్​ -10లో భారత మహిళా క్రికెటర్ల ర్యాంకుల్లో ఏ మార్పు లేదు. అగ్రస్థానంలో షెఫాలీ వర్మ(776 పాయింట్లు), నాలుగో స్థానంలో స్మృతి మంధాన(693 పాయింట్లు) కొనసాగుతున్నారు. ఆల్​రౌండర్​ విభాగంలోనూ.. దీప్తి శర్మ 304 పాయింట్లతో ఐదో ర్యాంకులో ఉంది. అయితే సోఫీ డివైన్​ (న్యూజిలాండ్​, 359 పాయింట్లు)ను వెనక్కునెట్టి 365పాయింట్లతో ఈ సారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది ఇంగ్లాండ్​ క్రికెటర్​ నటైల్​ సీవర్.​

బౌలింగ్​ విభాగంలో దీప్తి శర్మ 704 పాయింట్లతో ఆరో ర్యాంకులో నిలవగా.. పూనమ్​ యాదవ్​(682), రాధా యాదవ్​(673) ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.

టీ20 ర్యాంకింగ్స్​

ఇదీ చూడండి: ICC Rankings: అగ్రస్థానంలో మిథాలీ, షెఫాలీ

ABOUT THE AUTHOR

...view details