తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC ODI Mens Ranking 2023 : వన్డే ర్యాంకింగ్స్​ రిలీజ్​.. టాప్​ 10లోకి రోహిత్.. విరాట్ ర్యాంక్​ ఎంతంటే ? - mohammed siraj odi ranking3

ICC ODI Mens Ranking 2023 : ఐసీసీ బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో రోహిత్​ శర్మ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. టీమ్ఇండియా​ నుంచి టాప్​10లో ఉన్న బ్యాటర్లు ఎవరంటే ?

ICC ODi Men's Ranking 2023
ICC ODi Men's Ranking 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 4:11 PM IST

Updated : Oct 18, 2023, 4:51 PM IST

ICC ODI Mens Ranking 2023 :అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్​ శర్మటాప్​ 10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి.. 719 రేటింగ్స్​తో ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 711 రేటింగ్స్​తో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 836 రేటింగ్స్​తో టాప్​లో ఉండగా.. టీమ్ఇండియా ఓపెనర్ శుభ్​మన్ గిల్ 818 రేటింగ్స్​తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్​లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన.. సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 742 రేటింగ్స్​తో మూడో ప్లేస్ దక్కించుకున్నాడు. అఫ్గానిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకొని 18వ స్థానం దక్కించుకున్నాడు. మరోవైపు నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్​ 16 స్థానాలు ఎగబాకి 27 ప్లేస్​లో కొనసాగుతున్నాడు.

టాప్​ 5లో స్థానాల్లో ఉన్న బ్యాటర్లు..

  • బాబర్ ఆజామ్ (పాకిస్థాన్) - 836 రేటింగ్స్
  • శుభ్​మన్ గిల్ (భారత్) - 818 రేటింగ్స్
  • క్వింటన్ డి కాక్ ( సౌతాఫ్రికా) - 742 రేటింగ్స్
  • రస్సీ వాన్ డర్ డస్సెన్ (సౌతాఫ్రికా) - 732 రేటింగ్స్
  • హ్యారీ టెక్టార్ (ఐర్లాండ్​) - 729 రేటింగ్స్

ఇక బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజెల్​వుడ్ 660 రేటింగ్స్​తో టాప్​లో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఒక పాయింట్ తేడాతో 659 రేటింగ్స్​తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడు వరల్డ్​కప్​లో బంగ్లాందేశ్​పై 2/45తో మెరిశాడు. దీంతో బోల్ట్ వన్డే కెరీర్​లో 200 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. టీమ్ఇండియా నుంచి సిరాజ్3వ (656 రేటింగ్స్​), కుల్​దీప్ యాదవ్ 8వ (641 రేటింగ్స్​) టాప్​ 10లో ఉన్నారు. స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా ఏడు స్థానాలు మెరుగుపర్చుకొని 606 రేటింగ్స్​తో.. సౌతాఫ్రికా బౌలర్ రబాడ (606 రేటింగ్స్​) తో కలిసి 14వ స్థానంలో కొనసాగుతున్నాడు.

టాప్​ 5లో స్థానాల్లో ఉన్న బౌలర్లు..

  • జోష్ హజెల్​వుడ్ (ఆస్ట్రేలియా) - 660 రేటింగ్స్​
  • ట్రెంట్ బోల్ట్ ( న్యూజిలాండ్) - 659 రేటింగ్స్
  • మహమ్మద్ సిరాజ్ ( భారత్ ) - 656 రేటింగ్స్
  • రశీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) - 654 రేటింగ్స్
  • ముజీబ్ అర్ రహ్మాన్ (అఫ్గానిస్థాన్) - 644 రేటింగ్స్

Team India ODI Ranking 2023 : టీమ్​ఇండియా.. క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన ఫీట్​.. నెం.1గా ఘనత

నిరాశపరిచినా నెం.1 ప్లేస్​లోనే సూర్య.. మరి కోహ్లీ ఎన్నో స్థానంలో అంటే?

Last Updated : Oct 18, 2023, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details