Harbhajan Singh Shares U-19 World Cup Photo: టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై విశ్లేషణలు చేస్తుంటాడు. దాదాపు 18 ఏళ్లపాటు జాతీయ జట్టుకు సేవలందించిన భజ్జీ 2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అనంతరం ఐపీఎల్ వంటి దేశవాళీ లీగ్‌ల్లో ఆడుతూ వచ్చాడు. 14వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 41 ఏళ్ల హర్భజన్ సింగ్ తన అండర్-19 క్రికెట్ రోజులను గుర్తు చేసుకుంటూ ఒక ఫొటోను షేర్ చేశాడు. 1998/99 సీజన్‌కు సంబంధించి అండర్ -19 ప్రపంచకప్‌లో హర్భజన్‌తోపాటు పాల్గొన్న మరో ఇద్దరు ఆటగాళ్లు అందులో ఉన్నారు. 'పెహచానో టు మానే (అర్థం తెలుసుకో)' అని క్యాప్షన్ ఇచ్చాడు.
టర్బోనేటర్ షేర్ చేసిన ఫొటోలో భజ్జీని సులువుగా గుర్తుపట్టేస్తారు. అయితే హర్భజన్‌కు చెరో వైపు ఉన్న ఆటగాళ్లలో ఒకరు మాత్రం మన భారతీయ క్రికెట్ అభిమానులకూ బాగా పరిచయస్తుడే. అందులో షర్ట్ లేకుండా ఉన్న ఆటగాడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఇమ్రాన్ తాహిర్ అంటే మీరు నమ్మగలరా..? అండర్-19 క్రికెట్ ఆడే రోజుల్లో తాహిర్ పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించేవాడు.. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు షిఫ్ట్ అయిపోయాడనుకోండి.. ఇక పాక్ జెర్సీ వేసుకున్న ఆటగాడి పేరు హసన్ రజా. 1996 నుంచి 2005 వరకు పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వీరి ముగ్గురిలో హర్భజన్ సింగే మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించాడు.