టీమ్ఇండియా ఈసారి ఎలాగైనా వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ప్రపంచకప్ టైటిల్ గెలిచే సత్తా టీమ్ఇండియాకు ఉందని కితాబిచ్చారు. శ్రీలంక, న్యూజిలాండ్‌పై రాణించిన జట్టునే కొనసాగించాలని.. ఆ మేరకు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆలోచించాలని గంగులీ సూచించాడు. కాగా, చివరిగా 2011లో టీమ్ఇండియా వరల్డ్‌కప్ గెలిచింది. ఆ తర్వాత 2013 నుంచి ఇప్పటివరకు ఒక ఐసీసీ టోర్నమెంట్ కూడా గెలవలేదు.
"టీమ్ఇండియా ఎప్పటికీ బలహీనమైన జట్టు కాలేదు. ఈ దేశంలో చాలా టాలెంట్ ఉంది. ఇంత ప్రతిభతో ఉన్న దేశం ఎప్పటికీ బలహీనమైన జట్టు కాలేదు. ఇప్పటివరకు సగం మందికి ఆడే ఛాన్స్ రాలేదు. రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ,సెలెక్టర్లకు నేనిచ్చే సలహా ఒకటే. వరల్డ్ కప్ వరకూ ఇదే జట్టును కొనసాగించండి. వరల్డ్ ఆడేటప్పుడు ప్లేయర్లు.. భారం లేకుండా, నిర్భయంగా క్రికెట్ ఆడాలి. గెలిచామా లేదా అన్నది తర్వాత విషయం'