ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు పడగొట్టిన భారత పేసర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. ఈ నేపథ్యంలో లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు.
కపిల్‌దేవ్ రికార్డును అధిగమించిన బుమ్రా - ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్
టీమ్ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మైలురాయిని 24 మ్యాచ్‌లో బుమ్రా చేరుకున్నాడు.
కపిల్‌దేవ్ రికార్డును అధిగమించిన బుమ్రా
ఈ మైలురాయిని 24 మ్యాచ్‌ల్లో చేరుకున్నాడు బుమ్రా. ఆ తర్వాతి స్థానాల్లో కపిల్ దేవ్(25 మ్యాచ్‌లు), ఇర్ఫాన్ పఠాన్(28 మ్యాచ్‌లు), మహ్మద్ షమీ(29 మ్యాచ్‌లు), జవగళ్ శ్రీనాథ్(30 మ్యాచ్‌లు), ఇషాంత్ శర్మ(33 మ్యాచ్‌లు) ఉన్నారు.
ఇదీ చూడండి..ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' రేసులో బుమ్రా
Last Updated : Sep 7, 2021, 3:28 PM IST