భారత్-ఇంగ్లాండ్‌ల తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 21 పరుగులు చేసింది. రోహిత్( 9), రాహుల్ (9) పరుగులతో క్రీజులో ఉన్నారు.భారత్ ఇంకా 162 పరుగులు వెనకబడి ఉంది.
ఇంగ్లాండ్ టెస్ట్: క్రీజులో హిట్‌మ్యాన్.. రాహుల్ - భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ స్కోర్ కార్డ్
భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టులో తొలిరోజు తొలి ఇన్నింగ్స్‌ను వికెట్లు నష్టపోకుండా ముగించింది. ఆట ముగిసే సమయానికి కోహ్లీసేన 21 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇంగ్లాండ్ టెస్ట్
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 183 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 4, షమి 3, శార్దుల్ ఠాకుర్ 2, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టారు. 64 పరుగులు చేసిన కెప్టెన్ జో రూట్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్.
ఇవీ చదవండి:
Last Updated : Aug 5, 2021, 12:49 AM IST