తెలంగాణ

telangana

ETV Bharat / sports

హనీ ట్రాప్​లో యువ క్రికెటర్​.. డేటింగ్ సైట్ ద్వారా పరిచయమై..​ - సయ్యద్ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2022

హనీ ట్రాప్‌ నుంచి ఓ యువ క్రికెటర్‌ త్రుటిలో తప్పించుకొన్నాడు. అప్పటికే తన నుంచి నిందితులు రూ.60 వేల నగదు, బంగారం, మొబైల్‌ ఫోన్‌ను లాగేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ క్రికెటర్ ఎవరంటే?

honey trap
హనీట్రాప్

By

Published : Nov 7, 2022, 10:31 PM IST

ఓ యువ క్రికెటర్‌ హనీ ట్రాప్‌నకు గురైన ఘటన కోల్‌కతాలో జరిగింది. సయ్యద్ ముస్తాక్‌ అలీ ట్రోఫీ భాగంగా కోల్‌కతా వెళ్లిన దిల్లీ క్రికెటర్ వైభవ్‌ కంద్‌పాల్‌ను లక్ష్యంగా చేసుకొని కోల్‌కతాకు చెందిన ముగ్గురు హనీ ట్రాప్‌ చేసి లక్షల్లో డిమాండ్‌ చేసేందుకు కుట్ర పన్నారు. తన అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారని నవంబర్ 2వ తేదీన వైభవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులు శుభంకర్‌ బిస్వాస్‌, రిషభ్‌ చంద్ర, శివ సింగ్‌లను అరెస్ట్‌ చేసి బారాసత్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.

పోలీసుల వివరాల ప్రకారం..
డేటింగ్‌ సైట్‌ ద్వారా ముగ్గురు వ్యక్తులు బాధితుడు వైభవ్‌ను బస్టాండ్‌కు పిలిపించారు. కొంతమంది యువతుల ఫొటోలను చూపించారు. సదరు మహిళల్లో ఒకరితో సమయం గడపవచ్చని చెప్పి క్రికెటర్‌ను నిందితులు నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు అభ్యంతరకర వీడియోలు విడుదల చేస్తానని బెదిరించి వైభవ్‌ నుంచి రూ.60వేల వరకు సొమ్ము, అతడి మొబైల్‌, బంగారు నగలను దోచేశాడు.

సమాచారం అందుకొన్న పోలీసులు నిందితుడితోపాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు. క్రికెటర్‌ నుంచే కాకుండా మరికొందరి నుంచి కూడా నిందితులు ఇలానే డబ్బును వసూలు చేశారని విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇందులో ఇంకెవరిదైనా హస్తం ఉందేమోనని అనుమానంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:'ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది'.. సచిన్​తో మీటింగ్​పై డివిలియర్స్

పంత్​ ప్రదర్శనపై ద్రవిడ్​.. సూర్య 'మిస్టర్ 360'పై ఏబీడీ కీలక కామెంట్స్​

ABOUT THE AUTHOR

...view details