తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: టాస్​ గెలిస్తే బ్యాటింగ్​కే ఓటు..!

న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ మధ్య మరి కాసేపట్లో ప్రపంచకప్​ తుదిపోరు జరగనుంది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన జట్టే కప్పు సొంతం చేసుకునే అవకాశముంది. లార్డ్స్​లో జరిగిన గత నాలుగు ఫైనల్స్​లో ముందు బ్యాటింగ్ చేసిన జట్టే 3 సార్లు నెగ్గింది.

బ్యాటింగ్

By

Published : Jul 14, 2019, 12:31 PM IST

మరికాసేపట్లో ప్రపంచకప్ 2019 ఫైనల్​ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే... టాస్ ఎవరు గెలుస్తారు? ఎందుకంటే ముందు బ్యాటింగ్ ఎంచుకున్న జట్టే విశ్వవిజేత అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ఇందుకు నిదర్శనంగా గతంలో లార్డ్స్​లో జరిగిన నాలుగు ఫైనల్స్​లో మొదట బ్యాటింగ్ చేసిన టీమే కప్పు ఎగరేసుకుపోయింది.

ఈ నాలుగు ఫైనల్స్​లో టాస్ గెలిచిన ప్రతీ జట్టు ఓటమి పాలవడం మరో ఆసక్తికర అంశం. 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్ ఫైనల్స్​కు లార్డ్స్ వేదికగా నిలిచింది. 1999 మినహా మిగతా మూడు పైనల్స్​లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.

అయితే ఈ మెగాటోర్నీలో పిచ్ బ్యాటింగ్​కు అనుకూలించడం వల్ల మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ సార్లు గెలిచాయి. అందువల్ల టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది. ముందు బ్యాటింగ్ చేసే జట్టే విజయం సాధిస్తుందని మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు.

"ఒకవేళ ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే భారీ స్కోరు చేసే అవకాశముంది. కివీస్ ఓపెనర్లు గప్తిల్, హెన్రీ నికోలస్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మక పోరులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని జయిస్తే లార్డ్స్​లో ఇంగ్లాండ్ జట్టు చరిత్రను తిరగరాసే అవకాశముంది. న్యూజిలాండ్​కే నా మద్దతు ఇస్తాను. కానీ ఫైనల్ ఫేవరెట్ మాత్రం ఇంగ్లీష్ జట్టే" -షోయబ్ అక్తర్, పాక్ మాజీ ఆటగాడు.

ఇది చదవండి: ప్రపంచకప్​ ఫైనల్​ టికెట్​ ధర 13 లక్షలా!

ABOUT THE AUTHOR

...view details