తన కుమారుడు అర్జున్ తెందూల్కర్‌కు షార్ట్కట్లు వాడొద్దని సలహా ఇస్తుంటానని క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్ చెప్పాడు. ఆయన తండ్రి(సచిన్ తండ్రి) రమేశ్ తెందూల్కర్ తనకు ఏం నేర్పించాడో అదే అర్జున్‌కు చెప్తానన్నాడు. ప్రస్తుతం ముంబయి టీ20 లీగ్‌లో సత్తాచాటుతున్న అర్జున్‌కు ఎలాంటి సలహాలిస్తారన్న ప్రశ్నకు ఈ విధంగా స్పందించాడు సచిన్.
కుమారుడికి క్రికెట్ దేవుడి హితబోధ
షార్ట్కట్లు వాడకుండా నిరంతరం శ్రమించమని తన కుమారుడికి చెప్తానని సచిన్ తెందూల్కర్ అన్నాడు. ఫలితం గురించి ఆలోచించకుండా ప్రయత్నించమని అర్జున్‌కు సలహా ఇస్తుంటానన్నాడు.
"అర్జున్‌కు క్రికెట్ ఆడమని నేను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. మొదట ఫుట్‌బాల్ ఆడాడు. తర్వాత చెస్‌పై మక్కువ పెంచుకున్నాడు. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు. తనకు ఏది ఇష్టమో అదే ఎంచుకోమని చెప్పాను. అతడు ఏది చేసినా.. నేను చెప్పేది ఒక్కటే. షార్ట్కట్లు వెతక్కుండా కష్టపడమని మాత్రమే సలహా ఇస్తాను. మా నాన్న నాకు అదే నేర్పించారు. ఓ తండ్రిగా నా పిల్లలకు ఆ విషయాన్నే చెప్తాను" -సచిన్ తెందూల్కర్
అందరిలా తాను కూడా తన కుమారుడు బాగా ఆడాలని కోరుకుంటానన్నాడు. నిజజీవితంలో ఒడుదొడుకుల్ని ఎదుర్కొని సమస్యలను అధిగమించాలని అన్నాడు. ఫలితం గురించి ఆలోచించకుండా ప్రయత్నించమని అర్జున్‌కు సలహా ఇస్తానని చెప్పాడు.
ముంబయి టీ 20 లీగ్‌లో అర్జున్.. 'ఆకాశ్ టైగర్స్' ముంబయి వెస్టర్న్ సబ్అర్బన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆకట్టుకుంటున్నాడు.