తెలంగాణ

telangana

ETV Bharat / sports

అఫ్గాన్​పై ఉత్కంఠకర పోరులో భారత్​ గెలుపు

సౌతాంప్టన్ వేదికగా అఫ్గానిస్థాన్​తో మ్యాచ్​లో భారత్​ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్​ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో షమీ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లతో విజృంభించాడు. అఫ్గాన్ బ్యాట్స్​మెన్ మహ్మద్ నబీ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

భారత్ విజయం

By

Published : Jun 22, 2019, 11:55 PM IST

Updated : Jun 23, 2019, 9:14 AM IST

ఇండియా- అఫ్గానిస్థాన్ మ్యాచ్​ హైలేట్స్

"పసికూనపై భారత్ సులభంగా విజయం సాధిస్తుంది.. కోహ్లీసేన.. ముందు బ్యాటింగ్ చేస్తే ఆ పరుగుల సునామీలో అఫ్గాన్​ కొట్టుకుపోతుంది". మ్యాచ్​కు ముందు భారత అభిమానులు ఊహగానాలివి. అయితే అనుకోని రీతిలో అఫ్గానిస్థాన్​ భారత్​ను కట్టడి చేసింది. చివరి ఓవర్​ వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో... భారత బౌలర్లు విజృంభించారు. చివరికి 11 పరుగుల తేడాతో అఫ్గాన్​పై విజయం సాధించింది భారత్. ప్రపంచకప్​లో భారత్​కు ఇది 50వ విజయం కావడం విశేషం.

షమీ చివరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగి మ్యాచ్​ను గెలిపించాడు. అఫ్గాన్ బ్యాట్స్​మెన్ మహ్మద్ నబీ (52) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రహ్మత్ షా (36) ఓ ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు తీయగా.. బుమ్రా, చాహల్, పాండ్య తలో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

రెండు కీలక వికెట్లు పడగొట్టిను జస్ప్రీత్​ బుమ్రాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

225 పరుగుల లక్ష్యచేదనతో బరిలో దిగిన అఫ్గాన్​.. ఇన్నింగ్స్​ను నిదానంగా ఆరంభించింది. జట్టు స్కోరు 20 పరుగులున్నప్పుడు ఓపెనర్ హజ్రతుల్లాను ఔట్ చేసి దెబ్బతీశాడు షమీ. అనంతరం వచ్చిన గుల్బదీన్ నయీబ్ ​(27), రహ్మత్ షా (36)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. నిలకడగా ఆడుతోన్న ఈ ద్వయాన్ని పాండ్య విడదీశాడు. అనంతరం హష్మతుల్లాతో (21) కలిసి స్కోరు వేగాన్ని పెంచాడు రహ్మత్ షా.

మలుపు తిప్పిన బుమ్రా

భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ అఫ్గాన్ బ్యాట్స్​మెన్ క్రీజులో పాతుకుపోయారు. స్కోరు నిదానంగా ముందుకు సాగుతోన్న సమయంలో మ్యాచ్​ను మలుపు తిప్పాడు బుమ్రా. ఒకే ఓవర్లో రహ్మత్​ షా, హష్మతుల్లాలను ఔట్ చేశాడు.

గుబులురేపిన నబీ..

రహ్మత్​ షా, హష్మతుల్లా ఔటైన తర్వాత నబీ చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు. 55 బంతుల్లో 52 పరుగులుతో ఆకట్టుకున్నాడు. ఆఖరి వరకు నిలబడి భారత్​కు విజయాన్ని దూరం చేసేంత పని చేశాడు.

చివర్లో ఉత్కంఠ.. షమీ హ్యాట్రిక్​

ఆఖరి ఓవర్లో అఫ్గాన్ గెలవాలంటే 16 పరుగులు కావాలి. మొదటి బంతినే ఫోర్​గా మలిచి అప్గాన్ అభిమానుల్లో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు నబీ. రెండో బంతినీ షాట్ ఆడగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. ఆ బంతికి స్కోరేమి రాలేదు. మూడో బంతిని షాట్ ఆడిన నబీ లాంగ్​ ఆన్​లో పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. నాలుగో బంతికి అఫ్తాబ్​ను బౌల్డ్​ చేశాడు షమీ. ఐదో బంతికి ముజీబుర్ రెహమాన్​నూ బౌల్డ్ చేసి భారత్​ గెలుపును ఖాయం చేశాడు. ప్రపంచకప్​లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన రెండో భారత బౌలర్​గా షమీ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 1987లో చేతన్​ శర్మ తీశాడు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 224 పరుగులు చేసింది. కోహ్లీ (67), కేదార్ జాదవ్ (52) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. వేగంగా పరుగులు చేయలేక భారత బ్యాట్స్​మెన్ తడబడ్డారు. అప్గాన్ బౌలర్లలో నబీ, గుల్బదీన్ నయీబ్​ చెరో 2 వికెట్లు తీశారు.

Last Updated : Jun 23, 2019, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details