2022లో మహిళల ఫుట్‌బాల్ ఆసియాకప్ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. మనదేశంతో పాటు చైనీస్ తైపి, ఉజ్బెకిస్థాన్‌లు టోర్నీ నిర్వహించేందుకు వేలంలో తమ పేర్లు నమోదు చేశాయి. మే 31తో ఈ గడువు ముగిసింది.
భారత్‌లో 2022 మహిళల ఫుట్‌బాల్ ఆసియాకప్!
మహిళల ఫుట్‌బాల్ ఆసియాకప్ టోర్నీ నిర్వహించేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. 2022లో జరిగే ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు వేలంలో పేరును నమోదు చేసింది. చైనీస్ తైపి, ఉజ్బెకిస్థాన్ కూడా ఈ టోర్నీని నిర్వహించేందుకు ముందుకొచ్చాయి.
ఆసియాకప్
ఆతిథ్యమిచ్చేది ఎవరనేది 2020 రెండో త్రైమాసికంలో ప్రకటిస్తారు. ఇంతకుముందు భారత్ 1979లో మహిళల ఫుట్‌బాల్ ఆసియాకప్ టోర్నీని హోస్ట్ చేసింది. చైనీస్ తైపి 2001లో నిర్వహించింది.
1979, 1983లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఆసియాలోని టాప్ 8 జట్లు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. మహిళా క్రీడా పోటీలకు సంబంధించి ప్రపంచంలోనే పురాతనమైనదిగా వీటికి పేరుంది. మొట్టమొదటగా 1975లో ఈ టోర్నీ నిర్వహించారు. 2022లో 20వ సారి జరపనున్నారు.