తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అప్పటి వరకు కెప్టెన్​గానా..? పెద్ద బాధ్యతే'

ఇంగ్లాండ్ కెప్టెన్​గా కొనసాగడంపై ఇంకా తాను ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాడు మోర్గాన్. 2023 వరకు సారథిగా ఉండాలంటే పెద్ద బాధ్యతే అవుతుందని అంటున్నాడు.

By

Published : Jul 20, 2019, 12:37 PM IST

మోర్గాన్

ఇప్పటికే రెండు మెగాటోర్నీల్లో ఇంగ్లీష్ జట్టుకు సారథిగా ఉన్న ఇయాన్ మోర్గాన్​ భవిష్యత్తు ప్రణాళికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాడు మోర్గాన్. ప్రపంచకప్​ మైకంలోనే ఉన్నానని అంటున్నాడు.

"2023 ప్రపంచకప్​ వరకు సారథిగా కొనసాగాలంటే అది పెద్ద బాధ్యతే అవుతుంది. ప్రస్తుతం ఇంకా ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేను. వరల్డ్​ కప్​ కోసం మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి లోనయ్యా. ఇంకా ఆ మైకంలోనే ఉన్నా. రెండు మూడు నెలల్లో నిర్ణయం చెప్తా" -ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ సారథి

ప్రస్తుతం జట్టుకు సంబంధించినంత వరకు 2020 టీ 20 ప్రపంచకప్పే అసలైన లక్ష్యమవుతుందని చెప్పాడు మోర్గాన్.

మోర్గాన్ సారథ్యంలో 2015 మెగాటోర్నీలో లీగ్​ దశలోనే ఇంటిముఖం పట్టింది ఇంగ్లాండ్. 2019 లో పరిస్థితి మారింది. జట్టును అన్ని విభాగాల్లోనూ ముందుకు నడిపి ఫైనల్​ వరకు చేర్చాడు మోర్గాన్. కివీస్​తో జరిగిన తుది పోరులో నాటకీయ పరిణామాల అనంతరం వరల్డ్​కప్​ విజేతగా నిలిచింది ఇంగ్లీష్ జట్టు.

ఇది చదవండి: విశ్వక్రీడల ముంగిట షట్లర్లకు గాయాల బెడద!

ABOUT THE AUTHOR

...view details