తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​- పాకిస్థాన్​ ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో కోత

ఇంగ్లాండ్​ ఆటగాళ్లు జాసన్​ రాయ్​, జోఫ్రా ఆర్చర్​ మ్యాచ్​ ఫీజులో 15 శాతం కోత విధించారు అంపైర్లు. పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఫీల్డింగ్​ సందర్భంగా మైదానంలో దురుసుగా ప్రవర్తించడమే ఇందుకు కారణం. స్లో ఓవర్​ రేటు కారణంగా పాక్​ జట్టు సభ్యులందరి మ్యాచ్​ ఫీజులపై ఫైన్​ పడింది.

ఇంగ్లాండ్​- పాకిస్థాన్​ ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో కోత

By

Published : Jun 4, 2019, 6:41 PM IST

Updated : Jun 4, 2019, 7:00 PM IST

ప్రపంచకప్​లో సోమవారం జరిగిన ఇంగ్లాండ్​- పాకిస్థాన్​ మ్యాచ్​లో ఫైన్​ల మోత మోగింది. మైదానంలో దురుసుగా ప్రవర్తించడం వల్ల ఇద్దరు ఇంగ్లాండ్​ ఆటగాళ్లు, స్లో ఓవర్​ రేటు కారణంతో పాక్​ జట్టు సభ్యుల మ్యాచ్​ ఫీజుల్లో కోత విధించారు అంపైర్లు.

అంపైర్​పై అసహనం వ్యక్తం చేయడం, మైదానంలో అమర్యాదగా ప్రవర్తించడం వల్ల ఇంగ్లాండ్​ ఓపెనర్​ జాసన్​ రాయ్​, బౌలర్​ జోఫ్రా ఆర్చర్​ల మ్యాచ్​ ఫీజులో 15 శాతం కోత పడింది. దీనికి తోడు వీరిద్దరికీ ఒక డీమెరిట్​ పాయింట్​ విధించారు.

స్లో ఓవర్​ రేట్​ కారణంగా పాకిస్థాన్​ సారథి సర్ఫరాజ్​ అహ్మద్​ మ్యాచ్​ ఫీజులో 20 శాతం కోత పడింది. ఇదే కారణంతో పాక్​ జట్టులోని ఇతర సభ్యులపై 10 శాతం ఫైన్​ విధించారు. అనంతరం ఆటగాళ్లు తమ తప్పును అంగీకరించారు.

ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది పాకిస్థాన్​.

ఇదీ చూడండి:- ఫీల్డింగే మా కొంప ముంచింది: మోర్గాన్

Last Updated : Jun 4, 2019, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details