తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్​-ఆసీస్​ సిరీస్​లో ఫలితాలను నిర్ణయించేది​ వారే'

భారత్​-ఆస్ట్రేలియా సిరీస్​ల్లో బౌలర్లే ఫలితాలను నిర్ణయిస్తారని మాజీ క్రికెటర్​ జహీర్​ఖాన్ అభిప్రాయపడ్డాడు​. ప్రపంచస్థాయి అత్యుత్తమ బౌలర్లు ఇరుజట్లలో ఉండటమే ఇందుకు కారణమని అన్నాడు.

zaheer khan news
'భారత్​-ఆసీస్​ సిరీస్​లో ఫలితాలను నిర్ణయించేది​ బౌలర్లే'

By

Published : Nov 20, 2020, 3:47 PM IST

భారత్​-ఆస్ట్రేలియా మధ్య క్రికెట్​ అంటే చాలా రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికే కంగారూ గడ్డపై అమీతుమీ తేల్చుకోడానికి టీమ్​ఇండియా కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్లు వన్డే, టీ20, టెస్టు సిరీస్​లు ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్​లపై తనదైన అభిప్రాయం వ్యక్తం చేశాడు భారత మాజీ పేసర్​ జహీర్​ఖాన్. ఈ సిరీస్​లో బౌలర్లే ఫలితాలను నిర్ణయిస్తారని స్పష్టం చేశాడు. రెండు జట్లలో ప్రపంచస్థాయి టాప్​ బౌలర్లు ఉండటమే దీనికి కారణమని అన్నాడు. ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి. నవంబర్​ 27న తొలి వన్డేతో ఈ పర్యటన ప్రారంభమవుతుంది.

"ఆస్ట్రేలియా పిచ్​లు మంచి బౌన్స్​, పేస్​కు అనుకూలం. అందుకే బౌలర్లే మూడు సిరీస్​ల్లో ఫలితాలను నిర్ణయిస్తారు. జట్టులోని బౌలింగ్​ విభాగాం ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్​ బౌలర్ల గురించి మాట్లాడుకుంటే మనకు గుర్తొచ్చే ఆటగాళ్లంతా ఈ సిరీస్​లో బరిలోకి దిగుతున్నారు. బుమ్రా, షమి, స్టార్క్​, కమిన్స్​ లాంటి టాప్​ ర్యాంక్​ బౌలర్ల ఉండటం వల్ల ఈ మ్యాచ్​లు రసవత్తరంగా ఉంటాయి"

-- జహీర్​ఖాన్​, భారత మాజీ క్రికెటర్​

జాగ్రత్తగా ఉండాల్సిందే..

స్టీవ్​ స్మిత్​, డేవిడ్​ వార్నర్​ రాకతో ఆస్ట్రేలియా జట్టు బలంగా మారిందని జహీర్ అన్నాడు​. అందుకే భారత్​ కాస్త కఠిన పరీక్ష ఎదుర్కొనే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. ఇరుజట్లు బ్యాటింగ్​, బౌలింగ్​ విభాగాల్లో పటిష్ఠంగా ఉండటం వల్ల పర్యటన రసవత్తరంగా ఉంటుందని, అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతుందని చెప్పాడు​.

2018-19లో ఇరుజట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్​ను భారత్​ కైవసం చేసుకుంది. 2-1 తేడాతో ట్రోఫీ నెగ్గిన కోహ్లీసేన ఈసారి అదే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

ABOUT THE AUTHOR

...view details