తెలంగాణ

telangana

ETV Bharat / sports

అయ్యో కమిన్స్​.. నీ రికార్డు పది కాలాలు పదిలం!

టీమిండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో కరీబియన్ ఆటగాడు కమిన్స్ అనుకోని రికార్డును మూటగట్టుకున్నాడు. క్రీజులో ఎక్కువ సేపు నిలిచి పరుగులేమీ చేయకుండా వెనుదిరిగిన రెండో క్రికెటర్​గా నిలిచాడు.

కమిన్స్

By

Published : Aug 25, 2019, 9:47 AM IST

Updated : Sep 28, 2019, 4:45 AM IST

భారత్​-వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్​లో 297 పరుగులు చేసిన టీమిండియా విండీస్​ను 222 పరుగులకు కట్టడి చేసింది. ఈ మ్యాచ్​లో కరీబియన్ ఆటగాడు మిగెల్ కమిన్స్​ అనుకోని రికార్డును మూటగట్టుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్​లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చిన కమిన్స్​.. సారథి హోల్డర్​తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో 45 బంతులాడిన ఈ ఆటగాడు ఒక్క పరుగు చేయకుండా చివరి వికెట్​గా వెనుదిరిగాడు. ఫలితంగా క్రీజులో ఎక్కువ సేపు గడిపి పరుగులేమీ చేయకుండా వెనుదిరిగిన రెండో బ్యాట్స్​మెన్​గా రికార్డులకెక్కాడు.

కమిన్స్ 95 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. న్యూజిలాండ్ క్రికెటర్ జియోఫ్ అల్లాట్​ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ ఆటగాడు 1999లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో 101 నిమిషాలు క్రీజులో ఉండి డకౌట్​గా వెనుదిరిగాడు.

ఇవీ చూడండి.. యాషెస్: ఏడు వికెట్లా.. 203 పరుగులా !

Last Updated : Sep 28, 2019, 4:45 AM IST

ABOUT THE AUTHOR

...view details