గతేడాది ఐపీఎల్ వైఫల్యాలను మర్చిపోయి తాజాగా ఆరంభించేందుకు ఎదురు చూస్తున్నామని చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ అన్నాడు. అన్ని విభాగాల్లో జట్టు బలంగా మారిందని పేర్కొన్నాడు. ఇంతకు ముందుతో పోలిస్తే మరింత సమతూకం పెరిగిందని తెలిపాడు. కుర్రాళ్లు స్ఫూర్తితో ఉన్నారని, అద్భుతంగా సన్నద్ధమవుతున్నారని వివరించాడు.
యూఏఈలో జరిగిన ఐపీఎల్-2020లో చెన్నై పేలవంగా ఆడింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. తొలిసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ప్రస్తుత సీజన్‌కు ముందు కొందరు ఆటగాళ్లను వదిలేసిన సీఎస్‌కే.. భారీ ధర పెట్టి కృష్ణప్ప గౌతమ్, మొయిన్ అలీని కొనుగోలు చేసింది. రాజస్థాన్ నుంచి రాబిన్ ఉతప్పను బదిలీ చేసుకుంది. ఈ ముగ్గురూ చేరడం జట్టుకు అదనపు బలం చేకూరిందని హస్సీ అన్నాడు.
ఇదీ చదవండి:సెహ్వాగ్ వరుస ఫోర్లు.. గంగూలీకి అర్థమైన ఆ విషయం