ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా వరుస విజయాలు సాధిస్తోంది ఆస్ట్రేలియా. అనిశ్చితికి మారుపేరు బంగ్లాదేశ్. ఈ రెండూ నాటింగ్‌హామ్ వేదికగా నేడు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో కంగారూలు మూడు, బంగ్లా ఐదో స్థానంలో ఉన్నాయి.
గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను మట్టి కరిపించిన బంగ్లాదేశ్.. ప్రత్యర్థి జట్లకు సవాలు విసురుతోంది. ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హాసన్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడీ ఆల్‌రౌండర్.
ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించింది. జట్టు సమతూకంతో ఉంది. గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆల్‌రౌండర్ స్టాయినిస్ నేటి మ్యాచ్‌లో ఆడనున్నాడు.
ప్రపంచకప్ ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడగా.. రెండింటిలో ఆసీస్ గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుత మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది.