బుధవారం అనుష్క 31వ పుట్టిన రోజు జరుపుకొంది. ఈ సందర్భంగా తన భార్యతో ఓ సరస్సు ఒడ్డున కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్న ఫొటో, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడిది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
సరస్సు ఒడ్డున 'విరుష్క' ప్రేమ కబుర్లు
ఐపీఎల్లో బెంగళూరు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించడం వల్ల... దాదాపు నెలన్నర రోజులు మ్యాచ్‌ల తర్వాత కోహ్లీకి విశ్రాంతి దొరికింది. ఈ ఖాళీ సమయంలోనే...మే 1న భార్య అనుష్క శర్మ పుట్టినరోజును సరదాగా గడిపారు విరుష్క దంపతులు.
సరస్సు ఒడ్డున 'విరుష్క' జంట కబుర్లు
ఇంగ్లాండ్‌లోని వేల్స్లో మే 30వ తేదీ నుంచి ప్రపపంచకప్ ఆరంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భార్యను తోడుగా తీసుకెళ్లేందుకు విరాట్‌కు బీసీసీఐ అనుమతివ్వడం విశేషం.