క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు మాత్రమే ఘనమైన వీడ్కోలుకు అర్హులని అన్నాడు టీమ్ఇండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్. ప్రస్తుతం ఉన్న యువ క్రికెటర్లందరికీ ఇలాంటి ఫెయిర్‌వెల్ కచ్చితంగా లభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపాడు.
"నేను ఆడిన చివరి వన్డే సిరీస్‌లో ఆరు వికెట్లు పడగొట్టాను. కానీ, మేము సిరీస్ గెలవలేకపోయాం. ఆ తర్వాత నేను ఎప్పుడూ భారత జట్టు తరపున ఆడలేదు. నాకు సహకారం లభించని విషయాల గురించి భవిష్యత్‌లో వివరంగా మాట్లాడుతా. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్‌లు ఘనమైన వీడ్కోలుకు అర్హులు. కానీ, వాళ్లకు అలా జరగలేదు. ఒకవేళ క్రికెటర్లకు మనం గౌరవం ఇవ్వకపోతే బయటి వ్యక్తులెవరూ వారికి గౌరవాన్ని ఇవ్వరు. నా విషయంలో ఏదైతే జరిగిందే అది మరో వ్యక్తికి జరగకూడదని ఆశిస్తున్నా".