ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ బ్యాట్స్‌మెన్ విభాగంలో మొదటి పదిస్థానాల్లో ముగ్గురు టీమ్ఇండియా ఆటగాళ్లు ఉన్నారు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 886 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. చెతేశ్వర్ పుజారా (766) 8వ, అజింక్యా రహానే (726) 10వ స్థానంలో నిలిచారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రిత్ బుమ్రా (779) 9వ స్థానానికి పడిపోయాడు. ఆల్ రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా మూడవ స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ ర్యాంకింగ్స్ : కోహ్లీ అదే జోరు.. బుమ్రా డౌన్
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బ్యాట్స్‌మెన్ విభాగంలో 886 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఏడు, పది స్థానాల్లో చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఉన్నారు. బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా తొమ్మిదో స్థానానికి పడిపోయాడు.
కోహ్లీ
మొత్తంగా బ్యాటింగ్ విభాగంలో 911 పాయింట్లతో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్లలో ఆసీస్ ఆటగాడు పీటర్ కమిన్స్ 904 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు.
ఇది చూడండి క్రిస్ వోక్స్ స్థానంలో దిల్లీ క్యాపిటల్స్‌కు ఎన్రిచ్