ఐపీఎల్ కోసం దుబాయ్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిరోజు ట్రైనింగ్ ముగించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే జట్టు సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. మొదటి శిక్షణ సమావేశంలో సంతృప్తి చెందినట్లు పేర్కొన్నాడు. స్పిన్నర్లు చాలా బాగా రాణిస్తున్నారని అన్నాడు. ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండటం వల్ల తొలిరోజు శిక్షణలో అడుగుపెట్టే ముందు కాస్త భయపడినట్లు వెల్లడించాడు.
"నిజానికి ఐదునెలలు బ్యాటింగ్‌కు దూరంగా ఉండటం వల్ల ట్రైనింగ్ ప్రారంభించాలంటే భయమేసింది. కానీ ఊహించిన దానికంటే చాలా బాగుంది. లాక్డౌన్ సమయంలో కాస్త శిక్షణ పొందుతూ.. నా ఫిట్నెస్ను కాపాడుకుంటూ వచ్చా. అది నాకు చాలా ప్లస్ అయ్యింది. ఒక వేళ ఫిట్‌గా లేకుండా సీజన్లో అడుగుపెడితే.. అది మనల్ని చాలా బాధిస్తుంది. స్పిన్నర్ల విషయానికొస్తే.. మొదటి రోజు చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. షాబాజ్ నదీమ్, వాషింగ్టన్ సుందర్ బంతిని సరైన ప్రదేశంలో ల్యాండ్ చేస్తున్నారు. చాహల్ బౌలింగ్ కూడా బాగుంది"