భారత్-బంగ్లాదేశ్ మధ్య చారిత్రక డే/నైట్ టెస్టు ఈడెన్ గార్డెన్స్లోఈనెల 22న ప్రారంభం కానుంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ..ఈ మ్యాచ్‌కు సంబంధించిన మస్కట్స్‌ను ఆదివారం ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంప్రదాయ టెస్టు క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకు కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాల్సిన అవసరముందని అన్నాడు. శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌కు సంబంధించిన తొలి మూడు రోజుల టికెట్లు అప్పుడే అమ్ముడుపోయాయని చెప్పాడు.
"ముందుకే సాగే తీరిదే. టెస్టు క్రికెట్‌లో కొత్త పద్ధతులను తీసుకురావాలి. ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతుంది. ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాల్సిందే. క్రికెట్ పరంగా భారత్ చాలా పెద్ద దేశం. కాబట్టి నూతన పద్ధతులను ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉంది."
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
దాదా..బంగాల్ క్రికెట్ సంఘానికి(కాబ్) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరగాల్సిన ప్రపంచకప్ మ్యాచ్‌ను ధర్మశాలకు బదులు కోల్‌కతాకు తీసుకొచ్చాడు. ఈ విషయంపై గంగూలీ స్పందించాడు.